ఒలింపిక్స్‌లో మహిళల చుట్టే వివాదాలు
అందంగా ఉందని ఒలింపిక్స్ నుంచి బహిష్కరించారంటూ రాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో చుట్టూ కాస్త వివాదం నడిచింది.
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో ఎక్కువశాతం వివాదాలు మహిళల కేంద్రంగానే జరిగాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇమానే ఖలీఫ్ గురించే అల్జీరియా బాక్సర్ అసలు.. పురుషుడా, మహిళా అని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇమానేతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆమె ప్రత్యర్థి ఏంజెలా కారిని 46 సెకన్లలోనే పోరాటం నుంచి తప్పుకుంది. గత ఏడాది నిర్వహించిన లింగ పరీక్షలో ఇమానేను పురుషుడిగా ప్రకటించి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అనర్హులుగా ప్రకటించారు. అయినా ఆమెకు ఒలింపిక్స్‌కు అర్హత కల్పించడంపై విమర్శలు చెలరేగాయి. 25 ఏళ్ల ఇమానే ఖలీఫ్‌పై విమర్శలు కొనసాగుతుండగానే ఆమె 66 కిలోల వెయిట్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కూడా సాధించేసింది. ఈ బంగారు పతకం సాధించిన తర్వాత ఇమానే ఖలీఫ్ చేసిన ప్రకటన అందరినీ ఆలోచింపజేసింది. తాను మిగిలిన మహిళల్లానే అని వ్యాఖ్యానించింది. మరో లింగ వివాదంలో చిక్కుకున్న తైవాన్ బాక్సర్ లిన్ యు యిన్ కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది.
స్పిమ్ సూట్‌లో హల్‌చల్
అందంగా ఉందని ఒలింపిక్స్ నుంచి బహిష్కరించారంటూ రాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో చుట్టూ కాస్త వివాదం నడిచింది. ఎక్కడికెళ్లినా స్విమ్ సూట్‌లో కనిపించడంతో ఆమెను ఆ దేశ ఒలింపిక్స్ కమిటీ స్వదేశానికి వెళ్లాలని ఆదేశించింది. అందంగా ఉందన్న కారణంతో ఆమెను పంపడం వివాదం రేపింది. ఆమె అందంతో జట్టులోని ఇతర ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తోందన్న కారణంతో అలోన్సోను స్వదేశానికి పంపించేశారు.
అనర్హత వేటు..
ఫ్రీ క్వాలిఫైయర్ బ్రేకింగ్ ఈవెంట్ లో ఆఫ్ఘన్ బ్రేక్ డాన్సర్ మనీజ తలాష్ మీద నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. మనీజ "ఫ్రీ ఆఫ్ఘన్ ఉమెన్" అనే నినాదాన్ని కలిగి ఉన్న దుస్తులను ధరించటమే అందుకు కారణం. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం వేదికపై రాజకీయ, మతపరమైన స్లోగన్లను ప్రదర్శించడం నిషేధం ఉంది.
భారత అథ్లెట్ చుట్టూ వివాదం
భారత రెజ్లర్ అంతిమ్ పంగల్ వివాదం కూడా కాస్త కలకలం రేపింది. తన అక్రిడేషన్ కార్డును తన సోదరికి ఇచ్చి ఒలింపిక్ విలేజ్‌కు పంపడంపై వివాదం రేపింది. దీంతో పంగల్‌పై మూడేళ్ల నిషేధం విధిస్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.