అమెరికా కోవర్ట్ ఆపరేషన్... యూరప్ కు వెన్నుపోటు - బైటపెట్టిన ప్రముఖ జర్నలిస్టు
రష్యా నుంచి యూరప్ కు వెళ్ళే గ్యాస్ పైప్ లైన్లను కోవర్టు ఆపరేషన్ ద్వారా అమెరికా పేల్చేసిందని ఆధారాలతో సహా బైట పెట్టాడు హెర్ష్.
అతని పేరు సిమౌర్ హెర్ష్.... ఆయనది అమెరికా...ఆయన ప్రముఖ ఇన్వె స్టిగేటివ్ జర్నలిస్టు.... గతంలో అతను 1968లో వియాత్నాంలో అమెరికా సైన్యం 500 మంది నిరాయుధులైన అమాయక ప్రజలను కాల్చి చంపిన వైనాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చాడు. ఇరాక్ లోని అబు గ్రైబ్ జైల్లో అమెరికా సైన్యం ఖైదీలపై చేసిన అరాచకాన్ని బయటపెట్టాడు. ఈ రెండు వ్యవహారాలను అమెరికా ఖండించింది. కానీ కొంత కాలం పోయాక అవన్నీ నిజాలే అని ప్రభుత్వమే ఒప్పుకుంది. ప్రపచం మొత్తం సంచలనం సృష్టించిన వాటర్ గేట్ కుంభకోణాన్ని హెర్ష్ రిపోర్ట్ చేశాడు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మ కమైన పులిట్జర్ అవార్డును హెర్ష్ అందుకున్నాడు. ఈ జర్నలిస్టు పేరు వింటేనే అమెరికా ప్రభుత్వానికి వణుకు వస్తుంది. అలాంటి జర్నలిస్టు ఇప్పుడు మరొ సంచలన విషయం బైటపెట్టాడు.
రష్యా నుంచి యూరప్ కు వెళ్ళే గ్యాస్ పైప్ లైన్లను కోవర్టు ఆపరేషన్ ద్వారా అమెరికా పేల్చేసిందని ఆధారాలతో సహా బైట పెట్టాడు హెర్ష్.
2022 సెప్టెంబరులో బాల్టిక్ సముద్రంలో నార్డ్ స్ట్రీమ్ నీటి అడుగున గ్యాస్ పైప్‌లైన్‌లపై బాంబు దాడికి వైట్ హౌస్ ఒక రహస్య మిషన్ కు ఆదేశాలిచ్చిందని జర్నలిస్ట్ హెర్ష్ పేర్కొన్నారు.
సిమౌర్ హెర్ష్ ప్రకారం, దీనిని నార్వే నుండి CIA (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నిర్వహించింది. యునైటెడ్ స్టేట్స్ కు చెందిన సముద్ర డైవర్లు పైపులైన్‌ల వెంట మందుపాతరలను అమర్చారు.
పైప్‌లైన్‌లపై బాంబు దాడికి సంబంధించిన ప్రణాళిక డిసెంబర్ 2021లో ప్రారంభమైందనిహెర్ష్ చెప్పారు.
హెర్ష్ తన బ్లాగ్ పోస్ట్‌లో, అధ్యక్షుడు జో బిడెన్ సీనియర్ జాతీయ భద్రత అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ప్రణాళిక అమలు చేయబడిందని పేర్కొన్నారు.
జూన్ 2022లో రష్యా కు చెందిన నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్ క్రింద పేలుడు పరికరాలను అమర్చారు. మూడు నెలల తర్వాత, సెప్టెంబర్‌లో, నాలుగు నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌లలో మూడింటిని నాశనం చేశారు.
US నావికాదళం పైప్‌లైన్‌పై దాడి చేయడానికి జలాంతర్గామిని ఉపయోగించాలని ప్రతిపాదించింది, అయితే వైమానిక దళం రిమోట్‌గా పేల్చగలిగే బాంబులను అమర్చడం గురించి చర్చించింది. ఏది ఏమైనప్పటికీ, సాక్ష్యాలను వదలకుండా రహస్యంగా చేయవలసి ఉంటుందని CIA చెప్పింది అనిహెర్ష్ తెలిపారు.
నార్వేలోని ఒక అమెరికన్ జలాంతర్గామి స్థావరం ఈ మిషన్ కోసం ఉపయోగించారని అతను చెప్పాడు. ఇదంతా నౌకాదళ విన్యాసాల ముసుగులో జరిగింది.
అసలు అమెరికా జర్మనీకి, వెస్ట్ యూరప్ కు గ్యాస్ సప్లై చేసే ఈ పైప్ లైన్లను ఎందుకు పేల్చేసిందంటే...
2021 డిసెంబర్లో రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల వద్దకు చేరడం మొదలైం ది. దీం తో ఉక్రెయిన్ పై రుష్యా దాడిఖాయమని తేలిపోయింది. అయితే ఆసమయంలో రష్యాను ఎలా దెబ్బకొట్టాలా అని అమెరికా ఆలోచించింది. జర్మనీ , వెస్ట్ యూరప్ రష్యా నుండి గ్యాస్ కొనడం వల్ల రష్యా డబ్బులు సంపాదించి అవే డబ్బులను ఉక్రెయిన్ పై యుద్దానికి ఉపయోగిస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావించాడు. వెంటనే జాతీయ భద్రత అధికారులతో సహా సీఐఏ అధికారులతో చర్చించి ఈ పైప్ లైన్ల పేల్చి వేతకు కుట్ర పన్నారు.
ఈ పైప్ లైన్ల పేల్చివేత తర్వాత జర్మనీ, పశ్చిమ యూరప్ దేశాలు గ్యాస్ ను ఎక్కువ ధర పెట్టి ఇతర దేశాలనుండి కొనాల్సి వచ్చింది.
అయితే ఈ పైప్ లైన్లను పేల్చిన తర్వాత ఆ పని చేసింది రష్యాయేనని అమెరికా ప్రచారం చేసింది. రష్యా అమెరికా వాదనను ఖండించినప్పటికీ, యూరప్ కానీ జర్మనీ కానీ రష్యా మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వె స్టిగేటివ్ జర్నలిస్టు సిమౌర్ హెర్ష్ ఈ విషయం బైటపెట్టడంతో అమెరికా విమర్శలను ఎదుర్కోక తప్పదు.
అయితే జర్నలిస్టు సిమౌర్ హెర్ష్ నివేదికౌను వైట్ హౌజ్ ఖండించింది. అవి పూర్తిగా తప్పుడు ఆరోపణలు, అన్నీ కల్పితాలు అని పేర్కొంది. CIA అధికార ప్రతినిధి కూడా ఈ నివేదికను ఖండించారు.
కానీ మరో వైపు రష్యా మాత్రం తీవ్రంగా స్పందించింది. ఈ కుట్ర వెనుక ఉన్న వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పేర్కొం ది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేసిన కుట్రల్లో, కోవర్ట్ ఆపరేషన్ లో ఇదే అత్యంత చిన్నది కావచ్చు. కానీ స్వంత మిత్రులనే దెబ్బ కొట్టడం అమెరికా నీతికి నిదర్శనం.