పాస్‌పోర్టులో ఇంటిపేరు లేకుంటే నో ఎంట్రీ
భారతీయ పాస్‌పోర్ట్‌లో ఒకే పేరుతో ఉన్న ప్రయాణికులు ఇకపై దుబాయ్‌కి వెళ్లాలంటే వారి పాస్‌పోర్టులో ఈ మేరకు అప్‌డేట్ చేయించుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు.
దుబాయ్ వెళ్లాలనే భారతీయ ప్రయాణికుల పాస్‌పోర్టులో ఇకపై పేరొక్కటే ఉంటే అనుమంతించమని, పేరుతో పాటు, ఇంటిపేరు, చివరి పేరు కూడా తప్పనిసరిగా ఉండాలని దుబాయ్ ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 21 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని తెలిపారు.
భారతీయ పాస్‌పోర్ట్‌లో ఒకే పేరుతో ఉన్న ప్రయాణికులు ఇకపై దుబాయ్‌కి వెళ్లాలంటే వారి పాస్‌పోర్టులో ఈ మేరకు అప్‌డేట్ చేయించుకోవాలని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. టూరిస్ట్, విజిట్ లేదా మరే ఇతర రకాల వీసాతో ప్రయాణించే వారి పాస్‌పోర్ట్‌లపై ఒకే పేరు ఉంటే దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి రావాల్సిందే. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు వ్యాపార భాగస్వామి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పాస్‌పోర్ట్‌లపై మొదటి పేరు, ఇంటిపేరు కాలమ్‌లలో అప్‌డేట్ చేసుకున్న ప్రయాణికులనే ఇకపై ఇండిగో విమానాల్లో కూడా దుబాయ్‌కి అనుమతిస్తామని ఆ సంస్థ కూడా ప్రకటన చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇండిగో మేనేజర్‌ను కానీ, goindigo.com వెబ్‌సైట్‌ని కానీ సందర్శించాలని తన ప్రయాణికులకు ఇండిగో విజ్ఞప్తి చేసింది.