9మందిని బలి తీసుకున్న సముద్ర తాబేలు మాంసం
ఆఫ్రికాలోని జాంజిబార్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా ఇక్కడ అత్యంత రుచికరమైనందిగా భావించే తాబేలు మాంసం తిని 9మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర అస్వస్థతగు గురై ఆసుపత్రి పాలయ్యారు.
ఆఫ్రికాలోని జాంజిబార్‌లో విషాదం నెలకొంది. స్థానికంగా ఇక్కడ అత్యంత రుచికరమైనందిగా భావించే తాబేలు మాంసం తిని 9మంది మృతి చెందగా, 78 మంది తీవ్ర అస్వస్థతగు గురై ఆసుపత్రి పాలయ్యారు.
ఒక్కోసారి మనం తినే ఆహారంలో జరిగే అతి చిన్న మార్పు ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన జాంబిజార్‌లో జరిగింది. ఇక్కడి ప్రజలకు సముద్రం తాబేలు మాంసం ఇష్టమైన ఆహారం. అయితే దీంట్లో ఉండే చెలోనిటాక్సిజం అనే విషం కొన్ని సందర్భాల్లో మరణాలకు దారి తీస్తుంది.
గత మంగళవారం అదే జరిగింది జాంజిబార్ ద్వీపవాసులు కొందరు తాబేలు మాంసం తినడంతో ఎనిమిది పిల్లలతో పాటు ఒక మహిళ మరణించారు. అలాగే.. 78 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీళ్లందరినీ ఆసుపత్రిలో చేర్పించి, తగిన చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ సముద్ర తాబేలు మాంసాన్ని తిన్నట్లు ప్రయోగశాల పరీక్షలు నిర్ధారించాయి.
తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సెమీ అటానమస్ ప్రాంతమైన జాంజిబార్‌లోని అధికారులు విపత్తు నిర్వహణ బృందాన్ని పంపారు. 2021లోనూ ఇక్కడ ఇలాంటి సంఘటనే జరిగింది. తాబేలు మాంసం తిని ఏడుగురు కన్నుమూశారు. తాజాగా, మరోసారి అలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో, సముద్ర తాబేలు మాంసం తినవద్దంటూ ప్రజలకు అధికారులు సూచన చేశారు