తుర్కియేలో మృతులు.. 72 వేలు..!
ఈ ప్రకృతి విలయం వల్ల దేశంలో 41,500 కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయని తుర్కియే ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న సిబ్బంది అడియమాన్ ప్రావిన్సులో ఒక 18 ఏళ్ల యువకుడిని, కహ్రామన్మారిస్‌లో మరో ఇద్దరిని మంగళవారం కాపాడారు.
తుర్కియేలో భూకంపం సృష్టించిన విలయంలో మొత్తం 72 వేల మంది మృతిచెంది ఉంటారని తుర్కియే వాణిజ్య సంస్థల సమాఖ్య `తుర్కిష్ ఎంటర్‌ప్రైజ్ అండ్ బిజినెస్ కాన్ఫెడరేషన్` తన అంచనా వెల్లడించింది. సమాఖ్య తాజాగా విడుదల చేసిన తన నివేదికలో.. దేశ ఆర్థిక వ్యవస్థ సుమారు 80 బిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.6.95 లక్షల కోట్లు) నష్టపోయే అవకాశముందని పేర్కొంది. దేశ జీడీపీలో ఇది 10 శాతం ఎక్కువని తెలిపింది.
సహాయక చర్యలు కుంటుపడిన సిరియాలో భూకంప బాధితులను ఆదుకోవడానికి వేర్పాటు వాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లడానికి అక్కడి ప్రభుత్వంతో ఐక్యరాజ్యసమితి ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ అరబ్ దేశాలు పంపించిన సామగ్రితో పలు విమానాలు సిరియాకు చేరుకుంటున్నాయి.
ఈ ప్రకృతి విలయం వల్ల దేశంలో 41,500 కు పైగా భవనాలు ధ్వంసమయ్యాయని తుర్కియే ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగిస్తున్న సిబ్బంది అడియమాన్ ప్రావిన్సులో ఒక 18 ఏళ్ల యువకుడిని, కహ్రామన్మారిస్‌లో మరో ఇద్దరిని మంగళవారం కాపాడారు.
మరోపక్క గడ్డ కట్టే చలిలో ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకోవడానికి ఖతార్ ముందుకొచ్చింది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ వేడుకల్లో తాత్కాలిక నివాసాలకు ఉపయోగించిన టెంట్ సామగ్రిని తుర్కియేకు పంపడానికి నిర్ణయించింది. తొలి విడత 350 శిబిరాల నిర్మాణాలకు సరిపడినంత సామగ్రిని పంపించింది. తుర్కియే, సిరియా రెండు దేశాల్లోనూ ఈ విలయం వల్ల మృతిచెందినవారి సంఖ్య ఇప్పటివరకు 41 వేలు దాటింది.