హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
హెచ్-1బీ వీసాలను ఆపే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన అమెరికా అధ్యక్షుడు
హెచ్-1బీ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసాలను ఆపే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే తనకు రెండువైపులా వాదనలు నచ్చాయని ట్రంప్ చెప్పారు. సమర్థులైనవారు అమెరికాకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందులో వారికి శిక్షణ ఇవ్వడం, అర్హతలు లేని వారికి సహాయం చేయడం కూడా ఉన్నాయని చెప్పారు. టెక్ దిగ్గజాలతో కలిసి వైట్‌హౌజ్‌లో నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ మేరకు బదులిచ్చారు. కేవలం ఇంజినీర్ల గురించి మాత్రమే తాను మాట్లాడటం లేదని అన్నిస్థాయిల వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ మాట చెబుతున్నట్టు వివరించారు. అమెరికాలో వ్యాపార విస్తరణకు నిపుణులు, సమర్థులైన వారు కావాలని హెచ్-1బీ వీసాతోనే అది సాధ్యమౌతుందని ట్రంప్ తేల్చి చెప్పారు. సాంకేతిక నిపుణులు అమెరికాకు రావడానికి హెచ్-1బీ వీసా ఉపయోగపడుతుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడుతున్న వేల ట్రంప్ మద్దతు దారులు విభేదిస్తున్నారు. వాటివల్ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతారని అంటున్నారు.