Telugu Global
International

ట్రంప్‌ 230, హారిస్‌ 205 సీట్లు కైవసం

24 రాష్ట్రాల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, 15 రాష్ట్రాల్లో కమలా హారిస్‌ గెలుపు

ట్రంప్‌ 230, హారిస్‌ 205 సీట్లు కైవసం
X

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ప్రకటించిన రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెజారిటీకి చేరువలో ఉన్నారు. ట్రంప్‌ 230, హారిస్‌ 205 సీట్లు కైవసం ఎలక్టోరల్‌ సీట్లు కైవసం చేసుకున్నారు.ఇప్పటివరకు ఆయన 24 రాష్ట్రాలలో గెలిచారు.హారిస్‌ 15 రాష్ట్రాల్లో గెలుపొందారు. మరో 5రాష్ట్రాల్లో కమలా హారిస్‌ ఏడు రాష్ట్రాలలో ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్ట్రోరల్‌ ఓట్లు ఉన్నాయి. వీటిలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.

ట్రంప్‌, హారిస్‌ గెలిచిన రాష్ట్రాలు ఇవే

ట్రంప్‌ అలబామా (9), ఆర్కాన్సాస్‌ (6), ఫ్లోరిడా (30), ఇండియానా (11), కెంటకీ (8), లూసియానా (8), మిసిసిపి (6), నార్త్‌ డకోటా (3), నెబ్రాస్కా (5), ఓహాయో (17), ఓక్లహోమా (7), సౌత్‌ కరోలినా (9), సౌత్‌ డకోటా (3), వెస్ట్‌ వర్జీనియా (4), టెన్ససీ (11), వయోమింగ్‌ (3), టెక్సాస్‌ (40), మిస్సోరి (10), యుటా (6), మోంటానా (4), కాన్సస్‌ (6), అయోవా (6), నార్త్‌ కరోలినా (16) రాష్ట్రాల్లో గెలుపొందారు.

కమలా హారిస్‌ కనెక్టికట్‌ (7), డెలవేర్‌ (3), ఇల్లినోయీ (19), మసాచుసెట్స్‌ (11), మేరీల్యాండ్‌ (10), న్యూయార్క్‌ (28), రోడ్‌ ఐల్యాండ్‌ (4), వెర్మాంట్‌ (3), కొలరాడో (10), న్యూజెర్సీ (14), డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా (3), మైన్‌ (2) రాష్ట్రాల్లో గెలిచారు.

7 స్వింగ్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ 6 చోట్ల ఆధిక్యం

అమెరికా అధ్యక్ష ఎన్నికలో 7 స్వింగ్‌ రాష్ట్రాల ఓట్లు కీలకం. వీటిలో ఆరు స్వింగ్‌ రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. స్వింగ్‌ రాష్ట్రాల్లోని ఆరిజోనా, జార్జియా, మిషిగన్‌, నార్త్‌ కరోలియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో ట్రంప్‌ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. పాపులర్‌ ఓట్లలో ట్రంప్‌నకు 52.4 శాతం, హారిస్‌కు 46.3 శాతం వచ్చాయి.

First Published:  6 Nov 2024 10:15 AM IST
Next Story