హమాస్‌కు ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు
తాను బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని వ్యాఖ్య
BY Raju Asari8 Jan 2025 1:15 PM IST

X
Raju Asari Updated On: 8 Jan 2025 1:15 PM IST
గాజాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు అమెరికా కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాను అధికార బాధ్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయాలని నిర్దేశించారు. తాను అధ్యక్షుడిని అయ్యేసరికి ఇజ్రాయెల్ బందీలు తిరిగి వారి దేశానికి చేరుకోకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు బందీల విడుదలకు చర్చలు చివరి దశకు చేరుకున్నాయని మధ్యప్రాచ్యంలోని అమెరికా ప్రత్యేక కార్యదర్శి స్టీవెన్ చార్లెస్ విట్కాఫ్ తెలిపారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టే నాటికి తాము మంచి అంశాలను ప్రస్తావించాలని ఆశిస్తున్నట్లు వివరించారు. హమాస్ బందీలను విడుదల చేయకపోతే ఆ సంస్థకే మంచిది కాదని హితవు పలికారు.
Next Story