Telugu Global
International

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ దూకుడు

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ట్రంప్‌నకు 210 సీట్లు , కమలా హారిస్‌ 113 సీట్లు కైవసం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ దూకుడు
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన మోంటానా, యూటా, నార్త్‌డకోటా, వయోమింగ్‌, సౌత్‌డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా.. 22 రాష్ట్రాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఆయనకు 210 ఎలక్టోరల్‌ సీట్లు లభించినట్లయింది. గెలవడానికి 270 ఎలక్ట్రోరల్‌ ఓట్లు కావాలి. మెజారిటికి చేరులో ట్రంప్‌ ఉన్నారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి 113 ఎలక్టోరల్‌ సీట్లను కైవసం చేసుకున్నారు. ఆమె 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. ఇల్లినోయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్‌, వెర్మాంట్‌, న్యూయార్క్‌, కనెక్టికట్‌, డెలవేర్‌, మసాచుసెట్స్‌, రోడ్‌ ఐల్యాండ్‌, కొలరాడో, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాను సొంతం చేసుకున్నారు.

ఇక కీలకమైన స్వింగ్‌ స్టేట్‌ జార్జియాలోనూ కమలా హారీస్‌ ఎదురీతున్నారు. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్‌ ఓట్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. అటు పెన్సిల్వేనియాలోని 19 ఓట్లలో మొదట హారిస్‌ హవా కనిపించినా... ప్రస్తుతం అక్కడ కూడా ట్రంప్‌ ముందంజలో ఉండటం గమనార్హం.

First Published:  6 Nov 2024 9:25 AM IST
Next Story