Telugu Global
International

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ఇక గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా

ట్రంప్‌ ఆదేశాల మేరకు గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా మారింది.

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ఇక గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా
X

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యవర్గం పాలనలో జోరు పెంచారు. గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా మార్చినట్లు ప్రకటించింది. దీంతో పాటు అలస్కన్‌ శిఖరం డెనాలిని మౌంట్‌ మెకిన్లీగా పేర్కొన్నది.అధ్యక్షుడి ఆదేశాల మేరకు గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మారింది. ఉత్తర అమెరికాలోని ఎత్తైనఅలస్కన్‌ శిఖరం డెనాలిని మౌంట్‌ మెకిన్లీగా మార్చాం. ఈ మార్పులు అగ్రరాజ్యం అసాధారణ వారసత్వాన్ని కాపాడటంతో పాటు గల్ఫ్‌ ఆఫ్‌అమెరికా చరిత్రను భవిష్యత్తు అమెరికన్లు సంబరంగా జరుపుకుంటారు అని ట్రంప్‌ అంతర్గత విభాగం ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే పేరు మార్పును సూచించాలని జియోలాజికల్‌ సర్వేకు ట్రంప్‌ ఆదేశించినప్పటికీ అంతర్జాతీయంగా ఇది సాధ్యం కాదని తెలుస్తోంది.

ఎత్తైన అలస్క శిఖరాన్ని గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు విలయం మెకిన్లీ గౌరవార్థం 'మౌంట్‌ మెకిన్లీ' అని పిలిచేవారు. ఆ తర్వాత 1975లో రాష్ట్ర అభ్యర్థన మేరకు డెనాలి (కోయికాన్‌ భాషలో ఎత్తు అని అర్థం)గా మార్చారు. అధికారం చేపట్టాక గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు మారుస్తానని ట్రంప్‌ మొదట మార్‌ ఎ లాగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రతిపాదించారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని పలుమార్లు పునరుద్ధాటించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంరతం గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు.

ట్రంప్‌ ప్రతిపాదనలను మెక్సికో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. ఇటీవల ఆ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌ మాట్లాడుతూ.. 1607లో గల్ఫ్‌ ఆప్‌ మెక్సికో పేరును వాడిన మ్యాప్‌లను చూపించారు. గతంలోనూ ఉత్తర అమెరికాను మెక్సికన్‌ అమెరికా అని పేర్కొనేవారని వెల్లడించారు.

First Published:  25 Jan 2025 10:55 AM IST
Next Story