Telugu Global
International

రేపటి నుంచి అమెరికాలో టిక్‌ టాక్‌ షట్‌ డౌన్‌

బైడెన్‌ దిగిపోతూ చైనీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌పై ఉక్కుపాదం

రేపటి నుంచి అమెరికాలో టిక్‌ టాక్‌ షట్‌ డౌన్‌
X

చైనాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ టిక్‌ టాక్‌ సేవలు ఆదివారం నుంచి అమెరికాలో నిలిచిపోనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలోని విధించిన ఫెడరల్‌ బ్యాన్‌ ఆదివారం నుంచే అమల్లోకి రానుంది. సోమవారం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. ఆయన బాధ్యతల్లోకి రావడానికి ముందే టిక్‌ టాక్‌ సేవలు నిలిచిపోనున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో టిక్‌ టాక్‌ యూజర్లు 170 మిలియన్లు ఉన్నారు. బైడెన్‌ ప్రభుత్వం ఇచ్చిన షట్‌ డౌన్‌ ఆర్డర్‌ ను 60 రోజుల నుంచి 90 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పాస్‌ చేసే అవకాశముందని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో వెల్లడించింది. బాధ్యతలు స్వీకరించడానికి ముందే ట్రంప్‌ కు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ పాస్‌ చేసే అధికారం ఉందా.. అది న్యాయబద్ధంగా చెల్లుబాటు అవుతుందా అనే చర్చ అమెరికాలో సాగుతోంది. చివరి నిమిషంలో ఇలాంటి ఉపశమనం ఏదైనా దొరికితే తప్ప అమెరికాలో తమ కార్యకలాపాలు నిలిపి వేయడానికి టిక్‌ టాక్‌ కూడా సిద్ధమవుతోంది.

First Published:  18 Jan 2025 7:56 PM IST
Next Story