ఆనందంగా ఉన్న దేశాల్లో ఈ సారి కూడా ఫిన్లాండ్ దే మొదటి స్థానం.. మనది 125వ స్థానం
ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో మన దేశం అనేక దేశాలకన్నా చాలా కింద , ఆఫ్ఘనిస్తాన్ కన్నా కాస్త పైన ఉంది. ఈ సారి కూడా సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మన దేశం 125వ స్థానంలో, ఆఫ్గనిస్తాన్ 137వ స్థానంలో ఉన్నాయి.
విశ్వగురువని, 5బిలియన్ల ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచానికి మార్గదర్శి అని మన భుజాలు మనమే చర్చుకొని ఆనందపడే మనం నిజంగానే ఆనందంగా ఉన్నామా ? ప్రతి సంవత్సరం సంతోషంగా ఉన్న దేశాల జాబితాను తయారు చేసే ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం కూడా ఆ జాబితాను విడుదల చేసింది.
ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో మన దేశం అనేక దేశాలకన్నా చాలా కింద , ఆఫ్ఘనిస్తాన్ కన్నా కాస్త పైన ఉంది. ఈ సారి కూడా సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మన దేశం 125వ స్థానంలో, ఆఫ్గనిస్తాన్ 137వ స్థానంలో ఉన్నాయి.
ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో సర్వే చేసి యూఎన్ సస్టెయినబుల్ డెవల్‌పమెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ ఈ నివేదికను వెల్లడించింది. ఈ జాబితాలో రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో ఐస్‌లాండ్ లు ఉన్నాయి.
ఆశ్చర్యకరంగా యుద్దంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్, ఉక్రెయిన్ పై యుద్దం వల్ల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన రష్యాలుకూడా మన కన్నా మెరుగ్గా 72, 92 స్థానాలను దక్కించుకున్నాయి.
సంతోషంగా ఉన్న టాప్ 20 దేశాల జాబితా :
1.ఫిన్లాండ్
2.డెన్మార్క్
3.ఐస్లాండ్
4.ఇజ్రాయెల్
5.నెదర్లాండ్స్
6.స్వీడన్
7.నార్వే
8.స్విట్జర్లాండ్
9.లక్సెంబర్గ్
10.న్యూజిలాండ్
11.ఆస్ట్రియా
12.ఆస్ట్రేలియా
13.కెనడా
14.ఐర్లాండ్
15.అమెరికా సంయుక్త రాష్ట్రాలు
16.జర్మనీ
17.బెల్జియం
18.చెకియా
19.యునైటెడ్ కింగ్‌డమ్
20.లిథువేనియా
ప్రపంచంలో అస్సలు సంతోషంగా లేని టాప్ 20 దేశాల జాబితా :
1.ఆఫ్ఘనిస్తాన్
2.లెబనాన్
3.సియర్రా లియోన్
4.జింబాబ్వే
5.కాంగో
6.బోట్స్వానా
7.మలావి
8.కొమొరోస్
9.టాంజానియా
10.జాంబియా
11.మడగాస్కర్
12.భారతదేశం
13.లైబీరియా
14.ఇథియోపియా
15.జోర్డాన్
16.వెళ్ళడానికి
17.ఈజిప్ట్
18.మాలి
19.గాంబియా
20.బంగ్లాదేశ్