దిగజారిన మన పాస్ పోర్ట్ ర్యాంక్, జపాన్ నెంబర్ 1
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ జపాన్ పాస్ పోర్ట్. మన దేశం పాస్ పోర్ట్ 85వ స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో మన దేశం 85వ స్థానానికి దిగజారింది. ఈ సంవత్సరం జనవరిలో 83వ స్థానం ఉన్న మన పాస్ పోర్ట్ ఈ ఆరు నెలల్లో 2 స్థానాలు తగ్గి 85 కు చేరింది.
ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ అయిన హెన్లీ & పార్ట్‌నర్స్ సంస్థ తాజాగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. అందులో సింగపూర్, సౌత్ కొరియాను వెనక్కి నెట్టి జపాన్ మొదటి ర్యాంకులో నిలిచింది.
వీసా అవసరం లేకుండా కేవలం పాస్ పోర్ట్ ద్వారానే తమ దేశాలకు అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా ఈ జాబితాను హెన్లీ ఇండెక్స్ రూపొందించింది.ఈ ఇండెక్స్ ప్రకారం జపాన్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా 193 దేశాలకు వెళ్ళవచ్చు. దాని తర్వాత స్థానాలు సింగపూర్, దక్షిణ కొరియా పాస్‌పోర్ట్ లకు వచ్చాయి. ఆ పాస్ పోర్ట్ ద్వారా 192 దేశాలకు వెళ్ళవచ్చు. అదే భారత్ పాస్ పోర్టు ద్వారా వీసా లేకుండా 57 దేశాలకు వెళ్ళవచ్చు. 80 దేశాలకు యాక్సెస్‌తో చైనా 69వ స్థానంలో ఉంది. 32 దేశాలకు మాత్రమే వెళ్లే వెసులుబాటుతో పాకిస్థాన్ 109వ స్థానంలో నిలిచింది. జాబితాలో అన్నింటికన్నా కింది స్థానం ఆఫ్ఘనిస్తాన్ కు వచ్చింది. ఆ దేశం పాస్ పోర్ట్ ద్వారా వీసా లేకుండా 27 దేశాలకు మాత్రమే వెళ్ళవచ్చు.
టాప్ పాస్ పోర్టులలో వరసగా జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, జర్మనీ, స్పెయిన్, ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్ ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే , బెల్జీయం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, అమెరికా , ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా హంగేరీ, పోలాండ్, లిథువేనియా, స్లోవేకియా లుండగా
జాబితాలో చివరగా నార్త్ కొరియా, నేపాల్, పాలస్తీనా, సోమాలియా,యెమెన్, పాకిస్థాన్, సిరియా, ఇరాక్, అఫ్ఘనిస్థాన్ పాస్ పోర్టులున్నాయి.