Telugu Global
International

పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడి

పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడి
X

ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ కేసులు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2030 నాటికి ఎయిడ్స్‌ మహమ్మారిని అంతం చేస్తామని ప్రణాళిక రచించారని, 2025 నాటికి కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లను 3.7 లక్షల కంటే తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపింది. అయితే.. 2023లో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి 13 లక్షలకు చేరుకుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2023 సంవత్సరం ముగిసే నాటికి దాదాపు 4 కోట్ల మంది ప్రజలు హెచ్‌ఐవీతో జీవిస్తున్నారని తన నివేదికలో వెల్లడించింది. వీరిలో 90 లక్షల మందికి పైగా చికిత్స తీసుకోవట్లేదని స్పష్టం చేసింది. దీని ఫలితంగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ప్రతి నిమిషానికీ ఒకరు మరణిస్తున్నారని తెలిపింది.

హెచ్‌ఐవీ సోకినవారిలో 2004లో 21 లక్షల మంది చనిపోగా.. 2023లో 6.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఐరాస వెల్లడించింది. ఎయిడ్స్‌ నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. దీన్ని అరికట్టడంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కిడం లేదని తెలిపింది. దీని నిర్మూలనకు నిధులు కేటాయిస్తున్నా.. పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్‌ అమెరికాలో కొత్త అంటువ్యాధులు పుట్టుకొస్తున్నాయని పేర్కొంది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కౌమార దశలో ఉన్నవారు, యువతలో ఈ వ్యాధి అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెక్స్‌ వర్కర్లు, వివాహేతర సంబంధాలు దీనిని పెరుగుదలకు ముఖ్య కారణమని పేర్కొంది. డ్రగ్స్‌ ఇంజెక్ట్‌ చేసే వ్యక్తుల సంఖ్య 2010తో పోలిస్తే.. 45 నుంచి 55 శాతానికి పెరిగిందని వివరించింది.

First Published:  24 July 2024 5:17 AM GMT
Next Story