Telugu Global
International

సిరియాలో టెన్సన్‌.. విమానాశ్రయం మూసివేత

అలెప్పో నగరంలోకి తిరుగుబాటుదారుల ప్రవేశం.. దాదాపు దశాబ్దం తర్వాత నగరంలోకి అడుగుపెట్టిన వైనం

సిరియాలో టెన్సన్‌.. విమానాశ్రయం మూసివేత
X

సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అస్సద్‌ను తిరుగుబాటుదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు దశాబ్ద కాలం తర్వాత తిరుగుబాటుదారులు అలెప్పో నగరంలోకి అడుగుపెట్టారు. దీన్ని మిలటరీవర్గాలు ధృవీకరించాయి. వారం రోజుల వ్యవధిలో ఇస్లామిక్‌ తీవ్రవాదుల బృందం హయత్‌ తహ్రీర్‌ అల్‌ షామ్‌ రెండు నగరాలను ఆక్రమించింది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా విమానాశ్రయాన్ని మూసివేశామని మిలవర్గాలు ప్రకటించాయి. బషర్‌ అల్‌ అస్సద్‌ ప్రభుత్వానికి అదనపు మిలటరీ సాయం అందిస్తామని రష్యా ప్రకటించింది. 72 గంటల్లో ఆ సాయం అందుతుందని వెల్లడించింది.

బుధవారం తిరుగుబాటుదారులు ఆకస్మిక దాడిని ప్రారంభించారు. ఈ పోరులో ప్రభుత్వ, ప్రత్యర్థి బలగాలకు చెందిన వాల్లు భారీ సంఖ్యలో మృతి చెందినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ పేర్కొన్నది. ఈ క్రమంలోనే శుక్రవారం నాటికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నఅలెప్పో నగరాన్నిచుట్టుముట్టారు. నగరంలో రెండు కారు బాంబు పేలుళ్లు జరిపారు. తిరుబాటుదారుల రాకెట్లు అలెప్పో వర్సిటీలోని విద్యార్థుల హాస్టల్‌ కేంద్రానికి దగ్గర పేలినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. 2016లో తిరుగుబాటుదారుల్ని ప్రభుత్వ బలగాలు తిప్పికొట్టాయి. సుమారు దశాబ్ద కాలం తర్వాత వాళ్లు చేసిన అది పెద్ద దాడి ఇదే. జైష్ అల్-ఇజ్జా బ్రిగేడ్‌కు చెందిన కమాండర్ ముస్తఫా అబ్దుల్ జాబెర్ ఆపరేషన్‌ రూమ్‌లో ఉండి ఈ దాడిని సమన్వయం చేశారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రాంతంలో గాజా వివాదం తర్వాత మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్-మద్దతు గల దళాల బలహీనపడ్డాయి. దీంతో తిరుబాటుదారులు దాడులకు మార్గం సులువైందంటున్నారు.

2011లో బషర్‌ అల్‌ అసద్‌ పాలనకు వ్యతిరేకంగా సిరియాలో తిరుగుబాటు మొదలైంది. దీన్నిఅణిచివేయడంలో రష్యా, ఇరాన్‌ సేనలు అసద్‌కు సాయం అందించాయి. 2016నాటి అలెప్పో యుద్ధంతో నాడు తిరుబాటు సమసిపోయింది. తిరుగుబాటు దారులకు తుర్కియే దేశం అండగా నిలుస్తున్నది.


First Published:  30 Nov 2024 7:41 AM IST
Next Story