ఇకపై బుర్ఖా ధరిస్తే.. అక్కడ ఫైనే
ప్రపంచ దేశాల్లో బుర్ఖాను నిషేధించిన మొదటి దేశాలు ఫ్రాన్స్, బెల్జియం కావడం గమనార్హం. 2011లో ఐరోపాలో బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాను నిషేధించారు.
మహిళల వస్త్రధారణ విషయంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బుర్ఖా సహా ఫేస్ గార్డులపై నిషేధాన్ని విధించింది. ఈ మేరకు బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్ వింగ్ పాపులిస్ట్ స్విస్ పీపుల్స్ పార్టీ సమర్థించింది.
దీని ప్రకారం.. ఇకపై మహిళలు బుర్ఖా ధరించడం కానీ.. లేదా, మరో వస్త్రంతో ముఖాన్ని కప్పివేయడం కానీ చేస్తే అది నేరంగా పరిగణిస్తారు. ఈ మేరకు బుర్ఖాను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీనికి అనుకూలంగా 151 మంది, వ్యతిరేకంగా 29 మంది ఓటేశారు.
వాస్తవానికి రెండేళ్ళ క్రితమే స్విట్జర్లాండ్ దేశ వ్యాప్తంగా ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే నిఖాబ్, బుర్ఖా, కొంతమంది నిరసనకారులు ధరించే స్కీ మాస్క్ వంటివాటిపై నిషేధం విధించడం మంచిదని 51 శాతం మంది స్విస్ ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో దీన్ని చట్టంలా మార్చాలని స్విస్ ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రూల్స్ ను అతిక్రమిస్తే గరిష్టంగా 1,000 స్విస్ ఫ్రాంక్ (సుమారు రూ.91 వేల) వరకు జరిమానా విధిస్తారు.
ప్రపంచ దేశాల్లో బుర్ఖాను నిషేధించిన మొదటి దేశాలు ఫ్రాన్స్, బెల్జియం కావడం గమనార్హం. 2011లో ఐరోపాలో బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాను నిషేధించారు. ఆ తర్వాత 2016లో బల్గేరియా, 2017లో ఆస్ట్రియా, 2018లో డెన్మార్క్ ఈ నిషేధం విధించిన దేశాలుగా ఉన్నాయి. ఈ దేశాలలో ‘ముఖ లక్షణాలను గుర్తించలేని విధంగా‘ సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో ఒకరి ముఖాన్ని కప్పి ఉంచడం చట్టవిరుద్ధం!
*