ఇంటర్నెట్, చార్జింగ్ అవసరం లేని స్మార్ట్ ఫోన్!
వచ్చే నెలలో లాంచింగ్.. అసలు ఇది నిజమేనా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎలన్ మస్క్.. మరో విషయంలో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆయన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారట! ఆ ఫోన్ కు ఇంటర్నెట్, చార్జింగ్ అసలు అవసరమే లేదని కూడా ప్రచారం చేస్తున్నారు. చార్జింగ్, ఇంటర్నెట్ లేకుండా అసలు ఫోన్ ఎలా పని చేస్తుందని కొందరు ప్రశ్నిస్తుంటే.. మస్క్ మామా మాయ అంతే అని కొందరు చెప్తున్నారు.. అసలు నిజమేంటి.. నిజంగానే మస్క్ మామా అలాంటి ఫోన్ ను లాంచ్ చేస్తున్నారా.. ఓ లుక్కేద్దాం!!
టెస్లా స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పటి వరకు ఎలన్ మస్క్ గానీ టెస్లా గాని ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 2021 నుంచి టెస్లా స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యాపారంలోకి దిగుతోందని ప్రచారం జరుగుతోంది కానీ ఇంతవరకు టెస్లా నుంచి స్మార్ట్ ఫోన్లు రాలేదు. తనకు స్మార్ట్ ఫోన్‌లు తయారు చేయాలన్న ఇంటస్ట్ర్ ఎంతమాత్రమూ లేదని గతంలోనే మస్క్ ప్రకటించారు.. అయినా టెస్లా పీఐ మూడు ఎక్స్‌ట్రార్డినరీ ఫీచర్లతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఆ ఫోన్ కు ఇంటర్నెట్ అవసరం లేదని, స్పేస్ ఎక్స్ శాటిలైట్ తో డైరెక్ట్ గా పని చేస్తుందని, సోలార్ సిస్టం ద్వారా ఆటో చార్జింగ్ చేసుకుంటుందనే ప్రచారమంతా ఉత్తిదేనని తేలిపోయింది.