Telugu Global
International

మా దేశం నుంచి వెళ్ళిపోండి.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సకు సింగపూర్ అల్టిమేటం!

శ్రీలంక నుండి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు కష్టాలు వీడటం లేదు. ముందుగా మాల్దీవులకు పారిపోయిన ఆయన అటునుండి సింగపూర్ కు వెళ్ళారు. అయితే అక్కడ కూడా ఎక్కువరోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

మా దేశం నుంచి వెళ్ళిపోండి.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సకు సింగపూర్ అల్టిమేటం!
X

శ్రీలంక నుండి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు కష్టాలు వీడటం లేదు. ముందుగా మాల్దీవులకు పారిపోయిన ఆయన అటునుండి సింగపూర్ కు వెళ్ళారు. అయితే అక్కడ కూడా ఎక్కువరోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. రాజపక్సేకు సింగపూర్ లో 15 రోజులు మాత్రమే ఉండటానికి అనుమతి ఉందని, ఆ తర్వాత ఒక్క రోజు కూడా తాము వీసా పొడిగించే ప్రసక్తే లేదని సింగపూర్ అధికారులు స్పష్టం చేశారు.

సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ... ''రాజపక్సను ఒక ప్రైవేట్ పర్యటన కోసం మాత్రమే సింగపూర్‌లోకి ప్రవేశించడానికి అనుమతించాము" అన్నారు.

'' అతను మమ్ములను ఆశ్రయం కోసం అడగలేదు. మేము అతనికి ఎటువంటి ఆశ్రయం ఇవ్వలేదు" అని ఆ ప్రతినిధి చెప్పారు.

కాగా సింగపూర్ లో గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలన్న దానిపై గొటబాయకు స్పష్టత లేదని తెలుస్తోంది. ఆశ్రయం కోసం ఆయన భారత్ ను సైతం సంప్రదించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే శ్రీలంక ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా గొటబాయ రాజపక్సేకు ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ నిరాకరించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

First Published:  18 July 2022 6:42 AM
Next Story