కామన్వెల్త్ గేమ్స్: పీవీ సింధుకు స్వర్ణ పతకం
కామన్వెల్త్ గేమ్స్ లో సింధు గోల్డ్ మెడల్ సాదించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడా క్రీడాకారిణి మీద సింధు అద్భుత విజయం సాధించింది.
BY Telugu Global8 Aug 2022 2:15 PM IST

X
Telugu Global Updated On: 8 Aug 2022 3:55 PM IST
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో కెనడాకు చెందిన మిచెల్లీ లీపై సింధు ఘనవిజయం సాధించింది. పీవీ సింధు విజయంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. మిచెల్లీ లీపై 21-15, 21-13తో సింధు ఏకపక్ష విజయం సాధించింది.
కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధుకు ఇదే తొలి స్వర్ణ పతకం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజత పతకం సాధించింది. సింధు సాధించిన స్వర్ణ పతకంతో బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 56కి పెరిగింది.
Next Story