Telugu Global
International

షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు

వారు ఒక భవనాన్ని కూల్చివేయగలరు. కానీ చిరిత్రను కాదు. దీన్ని వారు గుర్తించుకోవాలన్నబంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని

షేక్‌ హసీనా తండ్రి ఇంటికి నిప్పు
X

బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చారిత్రక నివాసంపై దాడి జరిగింది. కొందరు నిరసనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. అనూహ్యంగా పదవి కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్‌ హసీనా సోషల్‌ మీడియా వేదిగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. ఆమె ప్రసంగంలో మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్‌ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢాకాలోఎ ఘటనలు చెలరేగినట్లు సమాచారం. ఇంటికి నిప్పుపెట్టడంపై కూడా ఆమె స్పందించారు. వారు ఒక భవనాన్ని కూల్చివేయగలరు. కానీ చిరిత్రను కాదు. దీన్ని వారు గుర్తించుకోవాలి అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని నిరసన కారులు పేర్కొన్నారు. అంతేగాకా.. 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

First Published:  6 Feb 2025 9:24 AM IST
Next Story