ఒకే ఒక్కడు... అరుదైన ఘనత సాధించిన షారుఖ్ ఖాన్ !
బ్రిటన్ కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నటీనటులకు సంబందించి 'ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్' జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత దేశం నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు మాత్రమే చోటు దక్కింది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రంపై దేశంలో ఓ వైపు రచ్చ జరుగుతుండగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనత లభించింది. బ్రిటన్ కు చెందిన ఎంపైర్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నటీనటులకు సంబందించి 'ఎంపైర్ మ్యాగజైన్ 50 గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఆల్ టైమ్' జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత దేశం నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కు మాత్రమే చోటు దక్కింది. జాబితాలో స్థానం పొందిన వారిలో హాలీవుడ్ దిగ్గజాలు టామ్ హాంక్స్, రాబర్ట్ డి నీరో, డెంజెల్ వాషింగ్టన్, నటాలీ పోర్ట్‌మన్, బెట్టె డేవిస్ ఉన్నారు.
ఈ వార్తను షారుఖ్ మేనేజర్ పూజా దద్లానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ కథనానికి సంబంధించిన క్లిప్‌ను షేర్ చేస్తూ.. "@iamsrk ఆల్ టైమ్ 50 మంది గొప్ప నటుల ఎంపైర్ లిస్ట్‌లో ఉన్నారు. మనల్ని ఎప్పుడూ గర్వపడేలా చేసే ఏకైక భారతీయుడు!" అని పేర్కొన్నారు. ఈ మ్యాగజైన్ కథనంలో.. షారుఖ్ ఖాన్ నటించిన ప్రముఖ చిత్రాలు వాటిలో పోషించిన పాత్రలు గురించి వివరించింది. అలాగే ఆయనకున్న అభిమానుల గణం, చెప్పిన డైలాగుల గురించి కూడా ఎంపైర్ పత్రిక తన కథనం లో పేర్కొంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ ఒక చిత్రంలో చెప్పిన " జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా తీస్తుంది. అదే బాంబ్ అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది "అన్న డైలాగ్ ను ప్రముఖమైనదిగా పేర్కొంది..
దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్‌లో షారూఖ్ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే', 'స్వదేశ్ ', 'కుచ్ కుచ్ హోతా హై', 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'మొహబ్బతే', 'వీర్-జారా' వంటి ప్రముఖ చిత్రాలలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన పఠాన్ మూవీ రాబోతుంది.