యూరప్ లో తీవ్ర కరువు...కీటకాలను తినాలంటున్న ప్రభుత్వం
యూరప్ లో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల అక్కడ ప్రజలకు ఆహారం దొరకడం కూడా కష్టమయ్యింది. దాంతో కొన్ని కీటకాలను ఆహారంగా తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ ప్రజలను కోరింది.
యూరప్ సమాజం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటూ ఆహార సంక్షోభంలో చిక్కుకుంది. ప్రజలకు మంచినీరు, ఆహారం, వంటి కనీస సౌకర్యాలు కూడా అందక అలమటిస్తున్నారు. దీంతో పాటు థరల పెరుగుదల విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యూరోపియన్ యూనియన్ త్వరలో కొత్త ఆహార విధానాన్ని అమలు చేయబోతోంది. ఈ క్రమంలో కీటకాలను ఆహారంగా విక్రయించడాన్ని అధికారికంగా ఆమోదించింది. యూరోపియన్ కమిషన్ ఇటీవల కొన్ని నిర్దిష్ట రకాల కీటకాలను ఆహారం,ఆహార పదార్థాలుగా విక్రయించడానికి అనుమతించింది.
యూరోపియన్ యూనియన్ అంతటా 'హౌజ్ క్రికెట్', పసుపు పురుగు,'వలస మిడతలు ఆహార పదార్ధాలుగా ఉపయోగించవచ్చని యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. వాటిని వినూత్న ఆహార జాబితాలో చేర్చినట్టు ప్రకటించింది. యూరోపియన్ కమిషన్ ఈ కీటకాలను తినడం 'సురక్షితమైనదేనని ' వాటిలో అధిక ప్రోటీన్లు, ఫైబర్లు,విటమిన్లు ఉంటాయని వరస ట్వీట్లను చేస్తూ ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
కీటకాలను తినడం 'పర్యావరణానికి మంచిది' ఎందుకంటే గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తక్కువగా ఉండటం, నీరు, వ్యవసాయ యోగ్యమైన భూములు తక్కువ గా ఉండడం వల్ల హౌజ్ క్రికెట్ లు, పురుగులు,మిడతలను ప్రజలు తినడం మంచిదే. దీని వల్ల వ్యర్ధాలు కూడా తక్కువవుతాయని పేర్కొంది.
వాస్తవానికి యూరోపియన్ యూనియన్ కమిషన్ 2021 నవంబర్‌లో వలస మిడతలను ఆహార జాబితాలో చేర్చింది. మిడతలు, పసుపు పురుగులతో పాటు ఆహారంగా తీసుకోవచ్చని పేర్కొంది. ఈయు త్వరలో మూడవ కీటకం హౌస్ క్రికెట్‌ను కూడా జాబితాలో చేర్చవచ్చని ఫిబ్రవరిలో వార్తలు వచ్చాయి. అది నేడు ఆచరణలోకి వచ్చింది. యూరోపియన్ కమిషన్ ఆమోదించిన ఈ కీటకాలను కాళ్లు తొలగించి ఎండిన లేదా ఘనీభవించిన(ఫ్రీజ్ చేసిన) రూపంలో లేదా పొడి రూపంలో చిరుతిళ్లుగా కానీ ఆహార పదార్థాలుగా కానీ విక్రయించవచ్చని పేర్కొంది.
పాకిస్తాన్‌లో 2019లో మిడతల సమూహాలు పంటలపై దాడి చేస్తున్నప్పుడు, సింధ్ ప్రావిన్స్‌లోని వ్యవసాయ మంత్రి ఇస్మాయిల్ రాహు వాటిని తినండంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరాచీ పౌరులు బిర్యానీ, కడాయి, బార్బెక్యూ వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవడం ద్వారా మిడతల నుండి ప్రయోజనం పొందాలని ఆయన సూచించారు.