Telugu Global
International

'చాట్ జీపీటీ'ని నిషేధించిన ఇటలీ, రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్

చాట్ జీపీటీపై పలువురు నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సారి చాట్ జీపీటీ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపణలున్నాయి. అలాగే ఇది డేటా నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి.

చాట్ జీపీటీని నిషేధించిన ఇటలీ, రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్
X

చాట్ జీపీటీ...ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట వినపడుతోంది. ప్రపంచ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ఈ చాట్ జీపీటీ మరోవైపు వివాదాలను కూడా సృష్టిస్తోంది. ఏఐ సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చాట్ జీపీటీ మనం ఏ అంశంపైనైనా ప్రశ్న అడిగినప్పుడు తనకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, పరిష్కారం చూపెడుతుంది.

చరిత్ర, కవితలు, కళలు, సాహిత్యం, రచనలు, వైద్య రంగం, రక్షణ రంగం, అంతరిక్షం, వ్యవసాయం, విద్య, పరీక్షలు, క్రీడలు... ఇలా ఏ రంగానికి చెందిన సమాచారం కావాలన్నా, సలహా కావాలన్నా చాట్ జీపీటీ వెంటనే అందిస్తుంది.

మరో వైపు దీనిపై పలువురు నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సారి చాట్ జీపీటీ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోపణలున్నాయి. అలాగే ఇది డేటా నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతోందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు చాట్ జీపీటీ ని నిషేధిస్తున్నాయి.

ఇప్పటికే రష్యా, ఉత్తర కొరియా, చైనా, ఇరాన్ చాట్ జీపీటీని నిషేధించగా.. తాజాగా ఈ లిస్ట్ లో యూరోపియన్ దేశం ఇటలీ చేరింది. డేటా నియమాల ఉల్లంఘన కేసు నేపథ్యంలో చాట్ జీపీటీని నిషేధిస్తున్నట్టు ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. ఇది తమ దేశపు జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్‌కు అనుగుణంగా ఉందో లేదో పరిశీలిస్తామని తెలిపింది.

First Published:  2 April 2023 9:11 AM IST
Next Story