Telugu Global
International

కూలిన సీప్లేన్‌.. ముగ్గురు మృతి

రాట్‌నెస్ట్‌ ద్వీపానికి వెళ్తున్న సీప్లేన్‌ టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికి సముద్ర నీటిలోకూలిపోయింది.

కూలిన సీప్లేన్‌.. ముగ్గురు మృతి
X

ఆస్ట్రేలియాలో జరిగిన సముద్ర విమాన ప్రమాదంలో పైలెట్‌ సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పెర్త్‌లోని బేస్‌ పాయింట్‌కు రిటర్న్‌ అవుతున్న విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సీప్లేన్‌లో ఏడుగురు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అరుదైన ఇసుక తీరాలకు కేంద్రమైన రాట్‌నెస్ట్‌ ద్వీపానికి సందర్శకులు భారీగా వెళ్తుంటారు. అక్కడికి చేరుకోవడానికి సీ ప్లేస్‌ సౌకర్యం ఉన్నది. ప్రమాదానికి గురైంది కూడా పర్యాటకులు వెళ్తున్న సీ ప్లేన్‌ అని అధికారులు తెలిపారు. దాంట్లో స్విస్‌, డానిష్‌ టూరిస్టులు ఉన్నారు. గాయపడిన వారిని పెర్త్‌ ఆస్పత్రికి తరలించారు.


First Published:  8 Jan 2025 1:34 PM IST
Next Story