ఉక్రెయిన్ పై మరో సారి విరుచుకపడ్డ రష్యా ...ఒకే సారి 70 క్షిపణిలు ప్రయోగం
శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిలతో ఉక్రెయిన్ లో రెండవ అతిపెద్ద నగరం, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ స్వంత పట్టణమైన క్రివీ రిహ్ పై విరుచుకపడింది.. ఈ సంఘటనలో 12 మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో క్రివీ రిహ్ పట్టణం అంధకారంలో మునిగిపోయింది.
రష్యా , ఉక్రెయిన్ యుద్దం మొదలై చాలా కాలం అయినప్పటికీ అది ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. రష్యా, ఉక్రెయిన్ పై బాంబులమోత మోగిస్తూనే ఉంది. యుద్దం మొదలైనప్పటినుంచి ఎన్నడూ లేని విధంగా రష్యా మొదటి సారి ఉక్రెయిన్ పై ఒకే సారి 70 క్షిపణిలను ప్రయోగించింది.
శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిలతో ఉక్రెయిన్ లో రెండవ అతిపెద్ద నగరం, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ స్వంత పట్టణమైన క్రివీ రిహ్ పై విరుచుకపడింది. ఈ సంఘటనలో 12 మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో క్రివీ రిహ్ పట్టణం అంధకారంలో మునిగిపోయింది. మొత్తం తొమ్మిది విద్యుత్ ఉత్పాదక కేంద్రాలను రష్యా మిస్సైల్స్ దెబ్బ తీశాయని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో చెప్పారు.
ఉక్రెయిన్ సైన్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని మాస్కో పేర్కొంది.
మరో వైపు ఈ దాడి ఘటనపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉక్రెయిన్ తిరిగి పుంజుకునేంత బలంగా ఉందని అన్నాడు. రష్యా వద్ద ఇంకా అనేక భారీ దాడులకు సరిపడా క్షిపణులు ఉన్నాయని, అందువల్ల తమకు మరింత మెరుగైన వాయు రక్షణ వ్యవస్థలను సరఫరా చేయాలని జెలెన్స్కీ పాశ్చాత్య మిత్రదేశాలను మళ్లీ కోరారు.