ప్రపంచంలోనే కాస్ట్‌లీ కారు లాంచ్ చేసిన రోల్స్‌రాయ్స్.. ధర జస్ట్ రూ.249 కోట్లే
రోల్స్ రాయ్స్ డ్రాప్‌లెట్ సిరీస్‌లో తొలి కారుగా దీన్ని లాంచ్ చేసింది. ల రోస్ నువార్ అని దీనికి పేరు పెట్టింది. ధరకు తగ్గట్టే దీని ఫీచర్లు కూడా అల్ట్రా టాప్ మోడ్‌లో ఉన్నాయి.
రోల్స్ రాయిస్.. ఆ పేరులోనే ఓ రాజసం. కారు కొనాలకునే సామాన్యడు మారుతీనో, టాటానో ఎలా గుర్తు పెట్టుకుంటాడో అలాగే ప్రపంచంలో అత్యంత ధనవంతులకు కారంటే గుర్తొచ్చే పేరు రోల్స్ రాయిస్. అలాంటి కంపెనీ ఇప్పుడు తాజాగా రోల్స్‌రాయ్స్ డ్రాప్‌టైల్ పేరుతో తీసుకొస్తున్న కారు మార్కెట్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఎందుకంటే దాని ధర జస్ట్ 249 కోట్ల రూపాయలేనట.
రోల్స్ రాయ్స్ డ్రాప్‌లెట్ సిరీస్‌లో తొలి కారుగా దీన్ని లాంచ్ చేసింది. ల రోస్ నువార్ అని దీనికి పేరు పెట్టింది. ధరకు తగ్గట్టే దీని ఫీచర్లు కూడా అల్ట్రా టాప్ మోడ్‌లో ఉన్నాయి. మన రోడ్ల మీద చూసే హైస్పీడ్ వెహికల్ ఫార్చూనర్ ఇంజిన్ జనరేట్ చేసే పవర్ 163 బీహెచ్‌పీ అయితే ఈ డ్రాప్‌లెట్‌లో అది 620 బీహెచ్‌పీ. 4.9 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అంటే ఇంజిన్ స్టార్టయిందని మనకు తెలిసేలోగానే బండి 100 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. గరిష్ఠ వేగం 249 కి.మీ.
లుక్కే అదుర్స్
ఓపెన్ టాప్‌గా ఈ మోడల్ వస్తుంది. దీనికి రూఫ్ అమరిస్తే కూపే మాదిరిగా మారుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు అమ్మే రోల్స్ రాయిస్‌కీ ఈ మధ్య వేగంగా వినియోగదారులు పెరుగుతున్నారు. వందల కోట్లు పెట్టి కార్లు కొనే స్థాయి సెలబ్రిటీలు పెరుగుతున్నారు. గతేడాది రోల్స్‌రాయిస్ ఏకంగా 6,021 కార్లు ప్రపంచవ్యాప్తంగా అమ్మడమే ఇందుకు నిదర్శనం.