Telugu Global
International

బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో ముందంజ‌లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు సునాక్‌..!

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి జ‌రుగుతున్న ఓటింగ్‌లో ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి అల్లుడు, బ్రిట‌న్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తొలి రౌండ్ లో విజ‌యం సాధించారు .

బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో  ముందంజ‌లో ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు సునాక్‌..!
X

బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి జ‌రుగుతున్న ఓటింగ్‌లో ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి అల్లుడు, బ్రిట‌న్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ తొలి రౌండ్ లో విజ‌యం సాధించారు . పాలక కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, బ్రిటన్ ప్రధాని ప‌ద‌వి కోసం జ‌రిగే ఓటింగ్ లో గెలుపొందిన వారిని ప‌ద‌వి వ‌రిస్తుంది. ఈ ప్ర‌క్రియ బుధ‌వారంనాడు ప్రారంభ‌మైంది. వివాదంలో చిక్కుకున్న ఎంపీకి మంత్రి ప‌ద‌విని ఇచ్చి ఇర‌కాటంలో చిక్కుకున్న బోరిస్ జాన్స‌న్ బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే.

కన్జర్వేటివ్ ఎంపీల తొలి బ్యాలెట్‌లో సునక్‌కు 88 ఓట్లు రాగా, పెన్నీ మోర్డాంట్ 67 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ 50 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. నాల్గవ స్థానంలో కిమ్ బాడెనోచ్ 40 ఓట్లు పొందగా, టామ్ తుగెన్‌ధాట్ 37 ఓట్లు, సుయెల్లా బ్రేవర్‌మాన్వ 32 ఓట్లు సాధించి ఐదు ఆరో స్థానాల్లో నిలిచారు.

ఇద్దరు అభ్యర్థులు - మాజీ ఆరోగ్య కార్యదర్శి జెరెమీ హంట్ ,ట్రెజరీ చీఫ్ నాధిమ్ జహావి ప్రధానమంత్రి రేసు నుండి తొలగిపోయారు. ఎందుకంటే వారు పోటీలో ఉండటానికి అవసరమైన గరిష్టంగా 30 ఓట్లను సాధించడంలో విఫలమయ్యారు.

358 మంది టోరీ చట్టసభ సభ్యులు బుధవారం మొదటి బ్యాలెట్‌లో ఓటు వేశారు,

"పార్టీకి, దేశానికి నా సందేశం ఒక్క‌టే..ఈ ఎదురుగాలుల‌ నుండి మన దేశాన్ని ర‌క్షించుకుంటూ ముందుకు నడిపించాలనే ఆలోచ‌న‌, ప్రణాళిక నా దగ్గర ఉంది." అని రిషి సునక్ ప్రధానమంత్రి పదవి కోసం తన ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు చెప్పారు.

బ‌రిలో నిలిచిన వారిలో రిషి సునాక్‌కు అత్య‌ధిక ఓట్లు ద‌క్క‌డంతో ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో అంద‌రికంటే ముందు నిలిచారు

First Published:  14 July 2022 8:10 AM IST
Next Story