Telugu Global
International

బైడెన్‌ రాజీనామా చేసి హారిస్‌ను అధ్యక్షురాలిని చేయండి

జో బైడెన్‌ చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్న కమలా హారిస్‌ మాజీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ జమాల్‌ సిమన్స్‌ సూచన

బైడెన్‌ రాజీనామా చేసి హారిస్‌ను అధ్యక్షురాలిని చేయండి
X

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవీ కాలం ముగియడానికి కొన్నివారాలే మిగిలి ఉన్నది. ఈ సందర్భంగా ఒక కొత్త డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేవరకు కమలా హారిస్‌కు పదవి అప్పగించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ జమాల్‌ సిమన్స్‌ సూచించారు. బైడెన్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఉపాధ్యక్షురాలు హారిస్‌ను అమెరికా మొదటి అధ్యక్షురాలిని చేయాలని ఆయన ఓ టాక్‌ షోలో పేర్కొన్నారు. ఇప్పటివరకు జో బైడెన్‌ అద్భుతంగా పరిపాలించారు. కానీ ఆయన చివరి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. రాబోయే కాలంలో అధ్యక్ష ఎన్నికల పోటీలో మహిళలు నిలువడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై డమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అధికారాన్ని దక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాలనూ ట్రంప్‌ సొంతం చేసుకుని 312 ఎలక్ట్రోరల్‌ ఓట్లతో విజయం సాధించగా.. హారిస్‌ 226 ఎలక్టోరల్‌ ఓట్లను దక్కించుకున్నారు.

First Published:  11 Nov 2024 1:21 PM IST
Next Story