Telugu Global
International

పాకిస్తాన్ దివాళా తీసింది.. ఆ దేశ‌ మంత్రి సంచలన వ్యా ఖ్యలు

సియాల్ కోట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మం త్రి మాట్లాడుతూ, రొట్టెలు, నీళ్ల కోసం కూడా ప్రజలు ఇబ్బం దుల పడుతున్నా రని.. దేశం లోద్రవ్యో ల్భ ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోం దని, పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిం దని అన్నా రు.

పాకిస్తాన్ దివాళా తీసింది.. ఆ దేశ‌ మంత్రి సంచలన వ్యా ఖ్యలు
X

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ పూర్తిగా దివాళా తీసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వా జా ఆసిఫ్ ప్రకటించారు.

చాలా కాలంగా పాకిస్తాన్ ప్రజలు ఆహారం కూడా దొరకక అల్లాడుతున్నారు. గోదుమ పిండికోసం కొట్టుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ లో లీటర్ పాల ధర రూ. 250, కిలో చికెన్ రూ. 1100కిచేరుకున్నా యి. ఇక పెట్రోల్ రూ. 270 కి, డిజిల్ రూ. 280ని దాటేశాయి. మరో వైపు పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను రుణం అడుగుతోంది. అయితే తాము పెట్టిన షరతులకు సై అంటేనే లోన్ ఇస్తామంటోంది ఐఎం ఎఫ్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దివాళా తీసిందని ప్రకటించారు ఆ దేశ రక్షణమంత్రి

సియాల్ కోట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మం త్రి మాట్లాడుతూ, రొట్టెలు, నీళ్ల కోసం కూడా ప్రజలు ఇబ్బం దుల పడుతున్నా రని.. దేశం లోద్రవ్యో ల్భ ణం రికార్డు స్థాయిలో నమోదు అవుతోం దని, పాకిస్తాన్ ఇప్పటికే డిఫాల్ట్ అయిం దని అన్నా రు. ఐఎంఎఫ్ రుణం కూడా పాకిస్తాన్ ను కాపాడలేదని ఆయన స్పష్టం చేశారు. ''ఇప్పుడు మనమే ఒక పరిష్కారం వెతకాలి'' అని ఆయన అన్నారు.

రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకపడ్డాయి. కేవలం 10 నెలల్లోనే దేశాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రమైన ఆర్థిక సం క్షోభం లోకి తీసుకెళ్లారని విమర్శ లు గుప్పిం చారు.

First Published:  19 Feb 2023 7:20 AM IST
Next Story