Telugu Global
International

యూఎన్‌ భద్రతా మండలిలో పాకిస్థాన్‌

రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్యదేశంగా చాన్స్‌

యూఎన్‌ భద్రతా మండలిలో పాకిస్థాన్‌
X

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌ కు చోటు దక్కింది. ఇండియా ఏళ్లకేళ్లుగా సభ్యత్వం కోసం ప్రయత్నిస్తుండగా మన దేశాన్ని కాదని పాకిస్థాన్‌కు అవకాశం ఇచ్చారేమిటా అని ఆలోచిస్తున్నారా? భద్రతా మండలిలో పాకిస్థాన్‌ కు తాత్కాలికంగా సభ్యదేశంగా అవకాశం దక్కింది. రెండేళ్ల పాటు పాకిస్థాన్‌ భద్రత మండలిలో సభ్యదేశంగా కొనసాగనుంది. అంటే 2026 డిసెంబర్‌ నెలాఖరు వరకు మరో పది దేశాలతో పాటు ప్రొవిజనల్‌ మెంబర్‌గా కొనసాగుతుంది. జపాన్‌ స్థానంలో పాకిస్థాన్‌ కు చోటు కల్పించారు. డెన్మార్క్‌, గ్రీస్‌, పనామా, సోమాలియా దేశాలకు భద్రత మండలిలో చోటు దక్కింది. పాకిస్థాన్‌ గతంలో ఏడు పర్యాయాలు (రెండేసి ఏళ్ల చొప్పున) ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సభ్య దేశంగా కొనసాగింది. ఐక్యరాజ్య సమితి 53 దేశాలతో 75 ఏళ్లక్రితం ప్రారంభమయ్యింది. ఇప్పుడు భద్రతా మండలిలో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ శాశ్వత సభ్యదేశాలు. ప్రతి రెండేళ్లకోసారి పది దేశాలకు రొటేషన్‌ పద్ధతిలో సభ్యత్వం దక్కుతుంది. ఈక్రమంలోనే పాకిస్థాన్‌ కు అవకాశం వచ్చింది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఐసిస్‌, అల్‌ ఖయిదా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ కు పాకిస్థాన్‌ మధ్య ఇటీవల ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో భద్రత మండలిలో సభ్యదేశంగా పాకిస్థాన్‌ ఎలాంటి పాత్ర పోషించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  1 Jan 2025 4:40 PM IST
Next Story