International
30 ఏళ్ళుగా రష్యాలో వ్యాపారం చేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఆ దేశం నుండి నిష్క్రమించాలని నిర్ణయించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. ఆ సంస్థ అత్యంత పేరెన్నికల గల పుష్కిన్ స్క్వేర్ రెస్టారెంట్ తో సహా దేశంలోని మొత్తం 850 రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించుకుంది. అమెరికన్ పెట్టుబడిదారీ విధానానికి చిహ్నమైన మెక్ డోనాల్డ్స్ 1990లో రష్యాలో తమ స్టోర్లను ప్రారంభించడం అప్పట్లో సంచలనమే. తమ మొదటి స్టోర్ ప్రారంభానికి […]
ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎలిసబెత్ బోర్న్ ఎంపికయ్యారు, 30 ఏళ్లలో ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. తన ప్రతిష్టాత్మక సంస్కరణ ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి లేబర్ మంత్రి ఎలిసబెత్ బోర్న్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. మే 1991 మరియు ఏప్రిల్ 1992 మధ్య పనిచేసిన ఎడిత్ క్రెస్సన్ దేశంలో మొదటి మహిళా ప్రధాని కాగా బోర్న్ రెండవ వారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి జీన్ కాస్టెక్స్ తన పదవికి రాజీనామా చేయగా […]
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్ల(3.3 లక్షల కోట్ల రూపాయల పైగా)) ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని, ఆ లెక్కలు తేలేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఆయన తెలిపారు. డైలీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ లేదా నకిలీ వినియోగదారులు 5 శాతం వరకు ఉండొచ్చని ట్విట్టర్ అంచనా […]
పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఆ పార్టీ అధినేత ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. విధి విచిత్రం. 73ఏళ్ల వయసులో రాజకీయాలనుంచి వైదొలగాలనుకుంటున్న ఆ మాజీ ప్రధాని తిరిగి దేశానికి నాయకుడు కావాల్సి వచ్చింది. ఆ విచిత్రం శ్రీలంకలో జరిగింది. ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్సే వైదొలగిన తర్వాత శ్రీలంక రాజకీయ సంక్షోభాన్ని గట్టెక్కించేందుకు రణిల్ విక్రమ సింఘేని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. ప్రస్తుత ఆర్థిక […]
ఆధునిక యుగంలో కూడా నియంతలా పాలిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా కట్టడిలోనూ నియంత అనిపించుకున్నారు. కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తొలిదశలో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. ప్రపంచంతో బంధాలు తెంపేసి వైరస్ కి నో ఎంట్రీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో కరోనా జాడ ఎరగని దేశం ఏదైనా ఉందీ అంటే అది ఉత్తర కొరియానే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ […]
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు రోజుకూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు శాంతియుతంగానే కొనసాగిన నిరసనలు, ర్యాలీలు ఇప్పుడు హింసాత్మకంగా మారడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తం అయ్యాయి. తాజాగా కొలంబోలో ఆందోళన కారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. గొడవలు జరుగుతున్న సమయంలో అటువైపు కారులో వెళ్తున్న అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకొరాలా హత్యకు గురయ్యారు. మొదట నిరసనకారులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో […]
శ్రీలంకలో దేశవ్యాప్త నిరసనలు తీవ్రతరం అవుతుండగా, శ్రీలంక ప్రధాన మంత్రి మహీందా రాజపక్స సోమవారం రాజీనామా చేశారు. మహీందా నిర్ణయం కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. దేశంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి పరిష్కారంగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని అధ్యక్షుడు గోట్‌బయ రాజపక్స శుక్రవారం ప్రత్యేక సమావేశంలో ప్రధానిని అభ్యర్థించినట్లు శ్రీలంకకు చెందిన డైలీ మిర్రర్ నివేదించింది. ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో, అధ్యక్షుడు రాజపక్స అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి […]
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. స్థానికంగా అంతా అస్తవ్యస్థమైపోయింది. ప్రపంచ దేశాలు నిత్యావసరాల రూపంలో సాయం అందిస్తున్నా పరిస్థితి అదుపులో లేదు. పోనీ అయిందేదో అయిపోయింది ఇప్పుడేం చేయాలి. ప్రభుత్వం మారితే పరిస్థితి మారుతుందా..? ఎన్నికలు జరపాలా..? అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదీ ఇప్పుడు అక్కడ ఉన్న అనిశ్చితి. ప్రతిపక్ష నాయకుడిని అధికారం తీసుకోవాలని అధ్యక్షుడు కోరినా ససేమిరా అనడం విశేషం. శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం […]
భౌగోళిక, స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ఆహార అలవాట్లు, వ్యవహారాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు అందరికీ మంచివే. అయితే ఆ అలవాట్లు కట్టు తప్పితే.. అసలుకే మోసం వస్తుంది. ధనిక దేశాలన్నీ ఇప్పుడి ఇదే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ఐరోపా ఒబెసిటీతో బాధపడుతోందని, ఓ భయంకరమైన అంటువ్యాధిలా ఒబెసిటీ ఐరోపాను పట్టిపీడిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఐరోపాలోనే ఎందుకు..? ఐరోపా వాసుల ఆహార అలవాట్లు, పనివేళలు క్రమంగా మారిపోతున్నాయి. […]