International
ఐపీఎల్ 15వ సీజన్ ద్వారా అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పోరు ఎలిమినేటర్ రౌండ్లోనే ముగిసినా…కెప్టెన్ కెఎల్ రాహుల్ మాత్రం ఓ అసాధారణ రికార్డుతో తన ఫ్రాంచైజీకే గర్వకారణంగా నిలిచాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో ముగిసిన హైస్కోరింగ్ థ్రిల్లర్లో కెఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ తుదివరకూ పోరాడి 14 పరుగుల పరాజయంతో టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించింది. 208 పరుగుల భారీటార్గెట్ తో […]
టాటా ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్ రౌండ్ రెండో (ఎలిమనేటర్ రౌండ్ ) పోరుకు లీగ్ టేబుల్ మూడు, నాలుగుస్థానాలలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ సై అంటున్నాయి. భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ నాకౌట్ పోరు రెండుజట్లకూ జీవన్మరణసమస్యగా మారింది. మరోవైపు…హైస్కోరింగ్ పోరుగా ముగిసిన క్వాలిఫైయర్ -1 లో రాజస్థాన్ రాయల్స్ ను అలవోకగా ఓడించడం ద్వారా అహ్మదాబాద్ టైటాన్స్ […]
ప్రపంచ టెన్నిస్ పురుషుల గ్రాండ్ స్లామ్ టోర్నీలలో ఓ అరుదైన రికార్డుకు టాప్ ర్యాంక్ ఆటగాడు, సెర్పియన్ వండర్ నొవాక్ జోకోవిచ్ గురిపెట్టాడు. పారిస్ లోని రోలాండ్ గారోస్ వేదికగా జరుగుతున్న 2022 ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో తొలిరౌండ్ విజయంతో టైటిల్ వేటను మొదలు పెట్టాడు. గారోస్ లో 82వ విజయం… హార్డ్ కోర్ట్ (ఆస్ట్ర్రేలియన్, అమెరికన్ ఓపెన్ ) టెన్నిస్ లో మొనగాడిగా పేరుపొందిన జోకోవిచ్…ప్రస్తుత సీజన్ ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నంబర్ వన్ […]
అమెరికాలోని టెక్సాస్ నగరం మారో సారి కాల్పుల మోతతో హోరెత్తింది. ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించిన ఓ టీనేజ్ ముష్కరుడు కనీసం 19 మంది పిల్లలను, ఇద్దరు పెద్దవారిని హతమార్చాడు. ఒక దశాబ్ద కాలంలో ఇదే అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ పేర్కొన్నారు. ఆంటోనియోకు పశ్చిమాన 130 కిమీ దూరంలో ఉన్న టెక్సాస్‌లోని ఉవాల్డే పట్టణంలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లో మంగళవారం ఉదయం అటోమేటిక్ రైఫిల్ తో ప్రవేశించిన 18 […]
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై మరో సారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దాన్నించి ఆయన తృటిలో తప్పించుకున్నాడు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్న సమయంలో ఈ హత్యాయత్నం జరగడం గమనార్హం. ఈ విషయాన్ని కూడా ఉక్రెయిన్ మిలటరీ అధికారే బైటపెట్టారు. నల్ల సముద్రం-కాస్పియన్ సీ మధ్య ఉన్న కాకసస్ ప్రాంతంలో పుతిన్‌పై దాడి జరిగిందని, ఆదాడి నుంచి ఆయన సురక్షితంగా బైటపడ్డాడని ఉక్రెయిన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ కైర్య్లో బుడానోవ్ […]
ది క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) సమ్మిట్‌లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. టోక్యో వేదికగా జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం ఇండియాకు చాలా కీలకంగా మారనున్నది. మన దేశానికి సరిహద్దులుగా ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కోవడానికి తగిన సపోర్ట్ కోసం ఈ క్వాడ్ ఉపయోగపడనున్నది. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు సభ్యులుగా ఏర్పడిన ఈ క్వాడ్.. భవిష్యత్‌లో దక్షిణ, తూర్పు ఆసియాలో కీలకంగా మారనున్నది. […]
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంత అల్లకల్లోలం సృష్టించిందో మరిచిపోలేం. అయితే అనారోగ్యాలు, మరణాలే కాదు లక్షలాది మందిని పేదరికంలోకి తోసింది. వందల మందిని బిలయనీర్లను చేసింది. ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ రిలీజ్ చేసిన నూతన సర్వే రిపోర్ట్ లో సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకవచ్చినట్లు ఆక్స్‌ఫామ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ కాలంలో 573 మంది కొత్త బిలియనీర్లు తయారయ్యారని నివేదిక తెలిపింది.అలాగే […]
తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఈ నెల 6వ తేదీ నుంచి ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అర్ద రాత్రి ఎమర్జన్సీని ఎత్తి వేసింది ప్రభుత్వం. ఒకవైపు ఆకలితో జనం ఆహా కారాలు….. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు రెండవ సారి రెండు వారాల క్రితం ఎమర్జన్సీ విధించారు. ఎమర్జన్సీ ఇచ్చిన అధికారాలతో సైన్యం ప్రజలపై విరుచుకపడింది. ప్రజలపై విచక్షణారహిత దాడులు జరిగాయి. […]
మన భూభాగంలో చైనా ఓ నూతన వంతెన నిర్మిస్తోందా ? కొంత కాలం క్రితం ఓ వంతెన నిర్మించిన చైనా మళ్ళీ మరో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిందా ? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ త్సో మీదుగా చైనా రెండవ వంతెన నిర్మిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి… భారతదేశ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలపై నిరంతరం నిఘా ఉంచుతున్నామని, […]
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మానవ హక్కుల కమిషన్ ను రద్దు చేశారు. కరుడు గట్టిన మత మౌడ్యులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చెజిక్కించునప్పటి నుండి ఎన్నికల సంఘం, మహిళా వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా ఆఫ్ఘన్‌ల స్వేచ్ఛను రక్షించే అనేక సంస్థలను మూసివేశారు. “మానవ హక్కులకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి మాకు న్యాయవ్యవస్థతో ముడిపడి ఉన్న కొన్ని ఇతర సంస్థలు ఉన్నాయి, ” అని డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి ఇనాముల్లా సమంగాని మీడియాతో చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ […]