International
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భార్య, కుమార్తెతోపాటు మరో 23 మంది అమెరికన్ల పై నిషేధం విధించినట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. “రష్యన్ రాజకీయ, పౌర ప్రముఖులపై నిరంతరం విధిస్తున్న అమెరికా ఆంక్షలకు ప్రతిస్పందనగానే తాము కూడా ఈ 25 మంది అమెరికన్ పౌరులపై ఆంక్షలు విధించినట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ‘స్టాప్ లిస్ట్’ ను ప్రకటించింది. ఈ జాబితాలో సుసాన్ కొలిన్స్, మిచ్ మెక్ కానెల్, చార్లెస్ గ్రాస్లే, కిర్ స్టెన్ […]
తమ దేశాల్లో బతుకు లేక పేద దేశాల్లోని ప్రజలు ధనిక దేశాలకు వలస వెళ్ళడం మామూలై పోయింది. అయితే వలస వెళ్ళే వాళ్ళలో ఎక్కువ మంది అక్రమంగా ఆయా దేశాల్లోకి ప్రవేశించే ప్రయత్నాల్లో మరణించడం ఈ మధ్య పెరిగిపోయింది. సముద్రాల్లో బోట్లు మునిగి… మంచు గడ్డల్లో చలి భరించలేక… ఇలా వందల మంది ప్రతి ఏడూ మరణిస్తూనే ఉన్నారు. అలాంటి హృదయ విదారక ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అమెరికా,టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో దారుణం జరిగింది. ఒకే […]
హైదరాబాద్ నగరం అనగానే అందరికీ బిర్యానీనే గుర్తుకువస్తుంది. ఇక్కడ రెండు మూడు తరాల నుంచి హోటల్స్‌ను నిర్వహించే వాళ్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాము. అయితే ఒక కుటుంబం 52 తరాలుగా నిర్వహిస్తున్న హోటల్ మీకు తెలుసా? అవును.. ప్రపంచంలోనే అతి పురాతనమైనదిగా గుర్తింపు పొందిన ఆ హోటల్ జపాన్‌లో ఉంది. జపాన్‌లో మౌంట్ ఫిజీకి సమీపంలో ‘ది నిషియామా ఆన్‌సెన్ క్యూంకన్’ అనే హోటల్ ఉంది. ఇది 705వ సంవత్సరంలో ఫుజివారా మహితో అనే వ్యక్తి […]
అమెరికాలో తరచూ జరిగే విచ్చలవిడి కాల్పుల నేపథ్యంలో అక్కడి గన్ కల్చర్‌పై కొన్ని ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలు ఎప్పటినుంచో ఆలోచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ ప్రత్యేకమైన బిల్లును ఆమోదానికి వచ్చింది. ఈ బిల్లులో ఏముందంటే.. అమెరికన్లు ఎదురు చూస్తున్న తుపాకుల నియంత్రణ బిల్లు త్వరలోనే పార్లమెంటు ఆమోదం పొందనుంది. ఎప్పటినుంచో నానుతూ వస్తున్న ఈ బిల్లు గొడవ గురువారం ఒక కొలిక్కి వచ్చింది. గురువారం 15 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు సమ్మతించడంతో […]
ఎక్కడైనా ఆందోళనలు, ఉద్రిక్తతలు జరుగుతున్నాయంటే తక్షణమే ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రభుత్వాలకు పరిపాటి. సంఘ విద్రోహక శక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అరాచకాలకు పాల్పడతాయంటూ చెబుతుంటాయి. అయితే కారణాలు ఏమైనప్పటికీ ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం సామాన్య ప్రజానీకానికి తీవ్రనష్టం జరుగుతుందనేది మాత్రం వాస్తవం. ఇదే విషయమై ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని వ్యతిరేకించింది. ఇటువంటి షట్ డౌన్ చర్యలకు పాల్పడవద్దంటూ ప్రపంచ దేశాలను కోరింది. ఏవో కారణాలు […]
అమెరికాలో మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు 50ఏళ్లుగా ఉన్న రాజ్యాంగపరమైన రక్షణకు ముగింపు పలుకుతూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్లి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మాత్రం స్వాగతించారు. అమెరికాలో మహిళలు ముఖ్యంగా యువతులు […]
అమెరికాలో తుపాకీ సంస్కృతికి కళ్లెం వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. దేశంలో పెరిగిపోతున్న గన్ వయొలెన్స్ ఘటనలను ఇకనైనా అదుపు చేసేందుకు నడుం కట్టింది. ఈ మేరకు గన్ కంట్రోల్ బిల్లుకు సెనేట్ ఆమోదముద్ర వేసింది. 28 ఏళ్ళ తరువాత మొదటిసారిగా సెనేట్ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుకూలంగా 65 మంది, ప్రతికూలంగా 33 మంది సభ్యులు ఓటు చేసినట్టు బీబీసీ వెల్లడించింది. ఇక ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపుతారు. […]
అమెరికాలో మళ్ళీ గన్ గర్జించింది. వాషింగ్టన్ లో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా పలువురు గాయపడ్డారు. 15 ఏళ్ళ యువకుడు అక్కడికక్కడే మరణించగా.. ఇతరులను ఆసుపత్రికి తరలించారు.. నగరం నడిబొడ్డునగల జూన్ టీన్త్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రాంతంలో హఠాత్తుగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వైట్ హౌస్ కి కేవలం 2 మైళ్ళ దూరంలో ఉందీ ప్రాంతం.. కాల్పులు జరిపిన అనుమానితుడికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఈ ఘటనను డీసీ పోలీస్ యూనియన్ […]
”విలన్ ఎక్కడో దాక్కొని ఉంటాడు.. హీరో హెలీకాఫ్టర్‌లో సరిగ్గా విలన్ ఉండే ఇంటి మీదే దిగేసి.. నాలుగు తన్నులు తన్ని.. హెలీకాఫ్టర్‌లో ఎత్తుకపోతాడు”.. ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తుంటాం. హాలీవుడ్ సినిమాల్లో యూఎస్ ఆర్మీ చేసే అద్భుతమైన పోరాటాలు చూసి.. నిజంగా అలా జరుగుతాయా అనుకుంటాం. బిన్ లాడెన్‌ను పట్టుకున్నప్పుడు ఇలాంటి కథనాలే వచ్చాయి. కానీ ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యులెవరూ లేరు. కానీ తాజాగా జరిగిన ఒక కిడ్నాప్ మాత్రం, హాలీవుడ్ సినిమా స్క్రీన్ లాగానే ఉన్నది. […]
న్యూయార్క్ వేదికగా ఆగస్టు 29 నుంచి జరిగే 2022 సీజన్ ఆఖరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ లో రష్యా, బైలో రష్యా క్రీడాకారులను అనుమతించాలని అమెరికన్ ఓపెన్ టెన్నిస్ సమాఖ్య నిర్ణయించింది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిన రష్యన్, దానికి మద్దతుగా నిలిచిన బైలోరష్యన్ క్రీడాకారులపై వింబుల్డన్ నిర్వాహకులు నిషేధం విధించిన నేపథ్యంలో.. అమెరికన్ టెన్నిస్ సమాఖ్య ఈ సంచలన నిర్ణయం తీసుకోడం విశేషం. క్రీడలతో రాజకీయాలా? పొరుగుదేశం ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను […]