International
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి నుండి వరసగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను ప్రధాని జాన్సన్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మొత్తం మంత్రివర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ బోరిస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో […]
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. మస్క్ ఇప్పటికే తన మాజీ భార్య, ప్రేయసి ద్వారా ఏడుగురు పిల్లలకు తండ్రయ్యాడు. తన కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే షివోన్ జిలిస్ ద్వారా నవంబర్ 2021లో ట్విన్స్‌కు తండ్రైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ అనే పత్రిక బుధవారం కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్, జిలిస్ కలిసి తమ పిల్లల పేర్లను మార్చుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పిల్లల ఇద్దరి […]
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అతడిపై పలు స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. గత నెలలో అవిశ్వాస తీర్మానాన్ని 12 ఓట్ల తేడాతో గెలిచి ప్రస్తుతానికి తన పదవిని కాపాడుకున్నారు. దీంతో ఆయన మరో ఏడాది పాటు ఆ పదవిలో ఉండేలా అవకాశం లభించింది. కానీ తన సొంత పార్టీ (కన్జర్వేటీవ్ పార్టీ) మాత్రం నిబంధనలు మార్చడానికి నిర్ణయం తీసుకున్నది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన […]
ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పాకిస్తాన్‌లోని కరాచిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలు దేరిన విమానం, మరి కొంతమంది ప్యాసింజర్స్‌ను ఎక్కించుకోవడానికి ముంబై చేరుకున్నది. అనంతరం దుబాయ్ వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. అయితే గాల్లోకి ఎగిరిన కొంతసేపటి తర్వాత ఇంధన వ్యవస్థలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్‌కి వెళ్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ (వీటీ-ఎంఎక్స్‌జీ) రకం విమానాన్ని ఢిల్లీ – దుబాయ్ మధ్య ఎస్‌జీ-011 నెంబర్‌తో […]
యురోపియన్ ఎండోమెట్రియోసిస్ లీగ్ (ఈఈఎల్ ).. అనే సంస్థ లండన్ లో… వచ్చే నవంబరులో ఎండోమెట్రియోసిస్ అనే అనారోగ్యానికి సంబంధించి ఒక మాస్టర్ క్లాస్ ని నిర్వహించాలని తలపెట్టింది. మహిళలకు వచ్చే అనారోగ్యం ఇది. గర్భ సంచి లోపల పెరగాల్సిన ఎండోమెట్రియం అనే పొర గర్భసంచి వెలుపల పెరగటం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయకపోతే… ఇది కొన్నిరకాల క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంది. మహిళల అనారోగ్యాలకు చికిత్స చేసే […]
పుర్రెకో బుధ్ది, జిహ్వకో రుచి అంటారు. ఎవరి పిచ్చి వారికానందం అన్నది కూడా నానుడి ! పెళ్లి అంటే ఎక్కడైనా వధూవరుల ముసిముసి నవ్వులు, బాజా భజంత్రీలు, బంధుగణం మధ్య మధ్య వరుడు వధువు మెడలో తాళికట్టడాలు మామూలే ! కానీ ఇక్కడో పెళ్లి పూర్తి వెరైటీగా, విచిత్రంగా జరిగింది. దీనిగురించి చెప్పుకోవాలంటే మెక్సికో వెళ్లాల్సిందే ! అక్కడి ఓక్సాకా అనే చిన్న గ్రామ మేయర్ ఒకరు ఎక్కడా లేనట్టు ఓ మొసలిని ‘పెళ్లి’ చేసుకున్నాడు. నమ్మశక్యం […]
దేశ సరిహద్దు అనగానే ముళ్ల కంచెలు, భారీగా పహారా కాసే సైన్యం, ఇటు మనిషి అటు పోకుండా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇండియాకు ఆనుకొని ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వద్ద ఇలాంటి సరిహద్దు దృశ్యాలే ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చూడబోయే సరిహద్దులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇవి పలు దేశాల మధ్య సరిహద్దులు అంటే మీరు నమ్మడం కూడా కష్టమే. అలాంటివి కొన్ని చూసేయండి. 1. పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దు యూరోప్ దేశాలైన పోలాండ్-ఉక్రెయిన్‌ల మధ్య 535 […]
10,000 కంటే ఎక్కువ మందిని 300 కోట్ల రూపాయల మేర మోసగించిన భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో అరెస్టయ్యాడు. నెవాడాలోని లాస్ వెగాస్‌కు చెందిన నీల్ చంద్రన్‌ను లాస్ ఏంజెల్స్‌లో బుధవారం అరెస్టు చేసినట్లు న్యాయ శాఖ తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం నీల్ చంద్రన్ ‘ViRSE’ అనే బ్యానర్‌తో ఓ ఇన్వేస్ట్‌మెంట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఈ కంపెనీకి అనుబంధంగా Free Vi Lab, Studio Vi Inc., ViDelivery Inc, ViMarket Inc, Skalex […]
జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా ..? దీనిపై అనేకమంది పరిశోధనలు చేశారు. సార్స్-కోవ్-2 గా వ్యవహరించే వైరస్ కోవిడ్-19 కి కారణమవుతుందని మొదట నిర్ధారించినప్పటికీ.. ఈ వైరస్ మనుషులకు, జంతువులకు మధ్య వ్యాప్తి చెందుతుందా అన్నదానిపై ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రజలు ప్రేమగా పెంచుకునే కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు.. వారి నుంచి ఇది సోకుతుందని, ముఖ్యంగా కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులు వీటితో క్లోజ్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ వైరస్ […]
బ్యాంకింగ్ పొరపాట్లు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఖాతాదారుడు అకౌంట్ నెంబర్ తప్పుగా రాయడమో.. బ్యాంకు ఉద్యోగి నిర్లక్యం కారణంగానో వేరే ఖాతాల్లోకి సొమ్ములు జమ అవుతుంటాయి. ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారుల అకౌంట్లలో రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు జమ అయ్యాయి. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లెం వల్ల అలా జరిగింది. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే సంఘటనలో మాత్రం తప్పంతా ఒక కంపెనీది. దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కన్సార్సియో ఇండస్ట్రియల్ డే అలిమెంటోస్ అనే […]