International
శ్రీలంకలో ఈ రోజు ఉదయం నుంచి సాగుతున్న ప్రజల నిరసనలు అదుపు తప్పాయి. వేలాది మంది ప్రజలు కొలొంబో చేరుకొని ఈ రోజు ఉదయాన్నే అధ్యక్ష భవనాన్ని ఆక్రమించారు. ఆ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పారిపోయాడు. అయినప్పటికీ పొద్దటి నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొలొంబోలో గంట గంటకూ ప్రజా సమూహము పెరుగుతూ ఉంది. శ్రీలంకలోని అన్ని ప్రాంతాలనుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని పట్టుకొని ప్రజలు కొలొంబో చేరుకుంటున్నారు. మరో వైపు ప్రధాని […]
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సైనికుల సాయంతో పలాయనం చిత్తగించడంతో కొలంబోలోని ఆయన నివాస భవనమంతా వేలాది నిరసనకారులతో నిండిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి ఆందోళనకారులు అధ్యక్ష భవనంవద్ద గల బారికేడ్లను విరగగొట్టి లోపలికి దూసుకువచ్చారు. ఉన్న కొద్దిమంది పోలీసులు, చివరకు సైనికులు సైతం వారిని అదుపు చేయలేక చేతులెత్తేయడంతో నిరసనకారుల దూకుడుకు అడ్డే లేకుండా పోయింది. టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ల ప్రయోగం కూడా వారిని ఆపలేకపోయాయి. అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లోకి దూకి […]
బ్రిటన్‌లో పీఎం పోస్టుకు బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక మెల్లగా ఇంట్రెస్టింగ్ కథనాలు బయటకొస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఆరిజిన్ రిషి సూనక్ తాలూకువే ఎక్కువ ! దేశ నూతన ప్రధానిగా, కన్సర్వేటివ్ కొత్త నేతగా తనను ఎన్నుకోవాలంటూ మాజీ ఆర్థికమంత్రి అయిన ఆయన ట్విట్టర్ వేదికగా ఇలా ప్రచారం ప్రారంభించారో, లేదో అప్పుడే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వార్తల్లోకి ఎంటరయ్యారు. మరేం లేదు ! బోరిస్ జాన్సన్ ఇల్లు బోసిపోయి కళావిహీనంగా ఉంటే ఇప్పుడు […]
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శనివారం దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. . తాను రాజీనామా చేస్తానని, దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని గతంలోనే చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని ఆయన కార్యాలయం తెలిపింది. శ్రీలంకలో ఇంధన పంపిణీ ఈ వారంలో పునఃప్రారంభం కానుందని, వరల్డ్ ఫుడ్ […]
భోరుమంటూ బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేశాక.. బ్రిటన్ ఇప్పుడు ఈ పోస్టులో కొత్త ముఖం కోసం వేచి చూస్తున్న వేళ… రేసులో నేను ముందున్నానంటూ రిషి సూనక్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ళ ఈ నేత తానే ఈ పదవికి తగినవాడినని అంటున్నారు. తన ఇండియన్ ఆరిజిన్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ ఫొటోలతో కూడిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. పీఎం పదవికి తనకే అర్హత ఉందని ఆయన ప్రచారం పారంభించారు. […]
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చాడు. గతంలో ట్విట్టర్ కొనుగోలుకు చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ విలీన అగ్రిమెంట్‌కు సంబంధించిన పలు నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు మస్క్ ప్రకటించాడు. కాగా, ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ఈ విషయంపై స్పందించారు. మస్క్ కుదుర్చుకున్న ట్విట్టర్ డీల్ అమలు జరిగేలా […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను ఇవాళ ఉదయం ఒక వ్యక్తి గన్‌తో కాల్చి చంపిన విషయం తెలిసిందే. జపాన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నరా నగరానికి వెళ్లారు. అక్కడ ప్రసంగిస్తున్న సమయంలో వెనుక నుంచి తెత్సూయా యమగమి అనే యువకుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు అబే శరీరంలోకి దూసుకొని పోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రగాయాల పాలైన అబేను స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఆసుపత్రికి తీసువచ్చేసరికే అబే నాడి కొట్టుకోవడం లేదని.. ఆర్గాన్స్ […]
జపాన్ మాజీ ప్రధాని షింజే దారుణ హత్యకు గురయ్యారు. నారా సిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వెనుక వైపు నుంచి ఆగంతకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షింజో అబే నారా సిటీలో వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. […]
బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేశాక ఇక ఆ పదవిలో నెక్స్ట్ ఎవరు ఉంటారనేదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇండియన్ ఆరిజిన్ అయిన (భారత సంతతికి చెందిన) రిషి సునాక్ పేరు పదేపదే వినిపించింది. ఇది భారతీయులకు గర్వ కారణమని కూడా పొంగిపోయాం.. కానీ తాజా లెక్కలు దీనికి అనుగుణంగా లేవు. బోరిస్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా వ్యవహరించిన బెన్ వాలెస్ ని ఈ పదవి వరించవచ్చునని తెలుస్తోంది. కేర్ టేకర్ గా ఇప్పటికీ ఆయన ఈ […]
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జరిగాయి. నారా సిటీలో ఆయన వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. ఒక్కసారిగా గన్ షాట్స్ శబ్దం వినిపించాయని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షింజో అబేని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కాల్పులు జరిపినట్టు భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం వ్యవహరించిన షింజో అబే.. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా […]