International

శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ప్రజల ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయిన తర్వాత ప్రస్తుతం ఆదేశం కొత్త‌ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో దేశాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్‌ అలహప్పెరుమా, లెఫ్టిస్ట్‌ నేత అనురా దిస్సనాయకేలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

40 డిగ్రీల ఎండలతో బ్రిటన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వారికి ఇబ్బందిగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ విధించింది.

మూడో రౌండ్‌లో రిషి సునక్‌కు 115 ఓట్లు పోలయ్యాయి. ఇతర అభ్యర్థుల కంటే పార్లమెంటులో రిషి అభ్యర్థిత్వం వైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తుండటం గమనార్హం.

శ్రీలంక నుండి పారిపోయిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు కష్టాలు వీడటం లేదు. ముందుగా మాల్దీవులకు పారిపోయిన ఆయన అటునుండి సింగపూర్ కు వెళ్ళారు. అయితే అక్కడ కూడా ఎక్కువరోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

అమెరికాలోని ఇండియానాలో మళ్ళీగన్ గర్జించింది. ఈ రాష్ట్రంలోని గ్రీన్ వుడ్ పార్క్ మాల్ లో నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి ఒకరు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కాల్పులు జరిపిన అగంతకుడిని ఓ యువకుడు కాల్చి చంపాడు.

“ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ గృహమై ఉంటుంది.” అంటారు పెద్ద‌లు. ఎప్పుడో ఇల్లు విడిచి భార‌త దేశానికి వ‌చ్చిన ఓ బాలిక కుటుంబం. దాదాపు 75 యేళ్ళ త‌ర్వాత ఇప్పుడు ఆమె 90 యేళ్ళ వ‌య‌సులో తిరిగి పాకిస్తాన్ లోని ఆమె ఇల్లు ‘ప్రేమ్ నివాస్’ కు వెళ్ళింది.

షార్జా-హైదరాబాద్ ఇండిగో విమానం ఆదివారం ఉదయం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో ల్యాండ్ అయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ కనుగొనడంతో విమానాన్ని కరాచీకి మళ్లించినట్టు అధికారులు తెలిపారు.

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయి ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి నెలకొంది. లీటర్ పెట్రోల్ 500 రూపాయలకు , టమాటాలు కిలో 500 రూపాయలకు, కిలో బియ్యం 350 రూపాయలకు కొనాల్సిన పరిస్థితి వచ్చిందక్కడ.

ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ మొదలవుతుంది. ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతోంది. శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టీస్ పై ఆందోళన చెందుతున్నారు.