International
ఉక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత మొదటి సారి భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి అనుకూలంగా పడ్డ 13 ఓట్లలో భారత్ ఓటు కూడా ఉంది.
ఆ సంక్షోభాన్ని ఎదుర్కోడానికి వడ్డీ రేట్లను తగ్గించడం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో సంక్షోభంలో కూరుకుపోయిన స్థిరాస్తి రంగానికి చైనా ఊతమిస్తోంది. రెండో దశ కొవిడ్ విజృంభణతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థకు అక్కడి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్దమవుతోంది. న్యాయమూర్తులపై, పోలీసు ఉన్నతాధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇమ్రాన్ పై పాక్ యాంటీ-టెర్రరిజం యాక్ట్ సెక్షన్ -7 ప్రకారం కేసు నమోదు చేశారు.
దేశ ఆదాయం ముఖ్యమా, జనం ఆరోగ్యం ముఖ్యమా… అంటే ఏ ప్రభుత్వమైనా ఆదాయానికే ఓటేస్తుంది. జపాన్ కూడా అదే బాటలో నడుస్తోంది.
బిల్కిస్ బానో కేసులో అత్యాచారం, హత్యలకు పాల్పడిన 11 మంది వ్యక్తులను జైలు నుంచి విడుదల చేయడాన్ని యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తీవ్రంగా ఖండించింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని USCIRF కమిషనర్ స్టీఫెన్ ష్నెక్ అన్నారు.
బ్రిటన్ లో రైల్వే కార్మికులు సమ్మెకు దిగారు. దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదల వారి వేతనాలు, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రబావం చూపుతుండటంతో వేతనాల పెంపుకోసం వాళ్ళు సమ్మె చేపట్టారు.
చైనా భారత దేశాన్ని కవ్విస్తోంది. సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోంది. కారాకోరం పీఠభూమిలో ఇటీవల ఆ దేశం జరిపిన మిసైల్ పేలుడే ఇందుకు సాక్ష్యం.
పిల్లల్ని బడికి పంపించడానికి తల్లులకు అమ్మఒడి పేరుతో ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.
జైళ్లలో పెడితే బెయిల్‌పై బయటకు వస్తారనే అనుమానంతో.. మతిస్థిమితం కోల్పోయారనే ముద్రవేసి మానసిక వైద్యశాలల్లో వేస్తోంది. 2010 మొదటి నుంచి నిరసనకారులు, హక్కుల కార్యకర్తలను ఇదే విధంగా పదుల సంఖ్యలో మానసిక వైద్యశాలల్లో నిర్బంధించినట్లు సదరు నివేదికలో పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ తలసరి ఆదాయం కంటే భారత్ తలసరి ఆదాయం ఇప్పుడు పడిపోయింది. ప్రపంచ దేశాల తలసరి ఆదాయాల లెక్కతీస్తే.. భారత్ లోయర్ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్‌లో ఉంది. అంటే సగటు భారతీయుడి సంపాదన విషయంలో భారత్ పరిస్థితి ఘోరంగా ఉంది.