International

జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి దాడి చేసింది. దాంతో జపాన్ అధికారులు ఈశాన్య ప్రాంతాల నివాసితులను సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్ళాల‌ని చెప్పారు .

సోషల్ మీడియా అతి వినియోగం వల్ల యువత డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది. రోజుకు రెండు గంటలకన్నా ఎక్కువగా సోషల్ మీడియాను వినియోగించవద్దని ఆ అధ్యయ‌నం సూచించింది.

CNN ఛానల్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన పరువుకు నష్టం కలిగిస్తూ వార్తలను ప్రసారం చేస్తున్నందుకుగాను తనకు 475 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

హామీల అమ‌లులో బ్రిటిష్ నూతన ప్ర‌ధాని యూ టర్న్ తీసుకున్నారు. అధిక ఆదాయం గ‌ల‌వారికి ప‌న్నులు త‌గ్గిస్తామ‌న్న హామీ పై ఆమె వెనక్కి తగ్గారు.

వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ స్వీడిష్ శాస్త్ర‌వేత్త స్వాంటే పాబో ను వరించింది. అంతరించిపోయిన ఆదిమాన‌వులు (హోమినిన్‌ల) జన్యువులు,మానవ పరిణామ క్ర‌మానికి సంబంధించిన ఆవిష్కరణలకు గాను సైంటిస్ట్ స్వంటే పాబో కు ఈ బహుమతి లభించింది.

ఇండోనేషియాలో తమ అభిమాన జట్టు ఓడిపోయిందన్న కోపంతో ఫ్యాన్స్ ఫుట్‌బాల్ మైదానంలోకి చొరబడటంతో పోలీసులు టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. దాంతో 130 మందికి పైగా మరణించినట్టు సమాచారం.

విమానం గాల్లో ప్రయాణిస్తుండగా హటాత్తుగా విమానంలోకి ఓ బుల్లెట్ దూసుక రావడంతో ప్రయాణీకుడు గాయపడ్డాడు. మయన్మార్ లో ఈ స‍ంఘటన జరిగింది.

ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించుకోవడానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి లో జరిగిన ఓటింగ్ కు భారత్ గైర్హాజరయ్యింది. దీనిపై తీర్మానాన్ని అమెరికా, అల్బేనియాలు ప్రవేశపెట్టాయి.

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 100 మంది విద్యార్థులు మరణించారు. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ (ISKP) ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్టు అధికారులు చెప్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా అబార్షన్‌కి ప్రత్యేక అనుమతి ఇచ్చే దేశాల సంఖ్య 13. పుట్టబోయే పిల్లల్ని తల్లిదండ్రులు పోషించలేరు అనుకుంటేనేవారికి అబార్షన్ అనుమతిస్తారు.