International
నోటీస్ టు ఎయిర్ మిషన్స్ (నోటామ్) అనే వ్యవస్థ విఫలం కావడంతో, పైలట్లకు ఎయిర్ పోర్ట్ అథారిటీలకు ఎలాంటి కమాండ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
హార్డ్ కాపీతో పాటు ఈ-బుక్, ఆడియో ఫార్మాట్‌లలోనూ ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ కలిపి తొలిరోజే యూకే వ్యాప్తంగా 4 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి.
నిన్న నేపాల్ పార్లమెంట్‌లో ప్రధానిపై విశ్వాస తీర్మానానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ జరిగింది. నేపాల్ ఫెడరల్ పార్లమెంట్లో 275 మంది సభ్యులు గల దిగువ సభ నుంచి ప్రచండ మొత్తం 268 ఓట్లను సాధించారు. ఒకరు ఎలిమినేట్ కాగా నలుగురిని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతించలేదు.
గోధుమలు, గోదుమ పిండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సులలోని అనేక ప్రాంతాలో గోదుమలు, గోదుమ పిండి కోసం ప్రజలు ఘర్షణలు పడుతున్నారు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న గోదుమ పిండి కోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి లైన్లలో నిలబడుతున్నారు. గోదుమ పిండి బస్తాలు ఉన్న ప్రభుత్వ లారీలపై, రేషన్ షాపులపై దాడులకు దిగుతున్నారు.
‘బెస్ట్ ఫర్ బ్రిటన్’ అనేసంస్థ చేపట్టిన సర్వే ఫలితాలను ది ఇండిపెండెంట్ వార్తాపత్రిక రిపోర్ట్ చేసింది. ఆ సర్వే డేటా ప్రకారం, 2024లో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన మంత్రి సునక్, ఉప ప్రధాని డొమినిక్ రాబ్, ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లేతో సహా సీనియర్ టోరీ (కంజర్వేటీవ్ పార్టీ)వ్యక్తులు ఓడిపోనున్నారు.
ఆకుపచ్చ జెండాలు, పసుపు రంగు దుస్తులు ధరించిన నిరసనకారులుల పార్లమెంటును ఆక్రమించారు. సుప్రీం కోర్ట్, అధ్యక్ష భవనాల్లోకి చొచ్చుకెళ్ళి లోపల విధ్వంస సృష్టించారు. నిరసన కారులు అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్మీ జోక్యం చేసుకోవాలని కోరుతూ బ్యానర్లు ప్రదర్శించారు.
ఇప్పటి వరకు.. షేర్, కాపీ, సెండ్ వయా మెసేజ్, బుక్ మార్క్ కోసం ఒకటే బటన్ ఉండేది. ఇప్పుడు బుక్ మార్క్ కోసం ప్రత్యేకంగా ఓ బటన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
రోబోట్ లాయర్ వాదనల వల్ల కోర్టు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని దానిని తయారు చేసిన అమెరికాకు చెందిన ‘డునాట్‌పే’ సంస్థ వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతో రూపొందించిన ఈ రోబో న్యాయవాది ఎవరి తరపున, ఏ కేసు వాదిస్తున్నది అన్న వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు.
పలువురు రిపబ్లికన్లు తమ అభ్యర్థిగా కెవిన్ మెక్‌కార్తీని నిలబెట్టినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొన్ని వర్గాలు ఆయనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెక్‌కార్తీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు మాట్ గేట్జ్ స్పీకర్ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రతిపాదించాడు.
ఇద్దరు పిల్లలున్న ఓ కుటుంబం టోక్యో నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే 12 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా క్రమక్రమంగా టోక్యో జనాభాను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.