International
జూన్ 16న కాండీ జిల్లాలోని పెరడేనియా టీచింగ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న ఒక పేషెంట్ మరణించాడు. ఇండియాలో తయారు అయిన బుపివాకైన్ అనే అనెస్థీషియాను వాడటం వల్లే ఆ మరణం సంభవించినట్లు స్థానిక మీడియా రిపోర్టు చేసింది.
ఉపాధి కోసం యూఎస్‌కు వెళ్లి అక్కడే శాశ్వతంగా ఉండాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ (గ్రీన్ కార్డ్)లను ఇస్తుంటుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది.
ఇన్ఫోసిస్ మాత్రం కాస్త కరాఖండిగా చెప్పేసింది. వారానికి 5రోజులు ఆఫీస్ కి రాకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ వాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. ఈ పార్లమెంట్ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది చివర్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 950 బిలియన్ పాక్ రూపాయలను దేశంలో పలు అభివృద్ధి పనులకు కేటాయించింది.
పాక్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే చర్యల్లో భాగంగానే ఈ హోటల్‌ను లీజుకిచ్చారు. ఇప్పటికే రుణాల ఊబిలో ఉన్నపాకిస్తాన్ అప్పులు రానురాను మరింత పెరుగుతున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించకుంటే.. మానవుడు నియంత్రించలేని శక్తిమంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తుందని వివరించారు.
2022లో విమాన ప్రయాణాల్లో జరిగిన సంఘటనల్లో నిబంధనలు పాటించని ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత పరస్పర దూషణ, మద్యం మత్తు వంటివి కూడా పెరిగినట్లు ఐఏటీఏ తెలిపింది.
అనుమానాస్పదంగా కనిపించిన బిజినెస్ విమానం.. కొంతసేపు వాషింగ్టన్‌లో ప్రయాణించి.. ఆ తర్వాత వర్జీనియాలోని ఓ అటవీప్రాంతంలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.
ఒక్క మే నెలలో నే AI సాంకేతికత కారణంగా దాదాపు 4,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.మరిన్ని కంపెనీలు ఆ బాటలో పయనించడానికి అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలకు తోడుగా ఇప్పుడు కూడా AI వచ్చి చేరింది.