International
హమాస్ మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్న సరిహద్దు ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫేక్ ఫొటోలు, వీడియోలు షేర్ కావడంతో.. గాజా, ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితి ఏంటనేది తెలుసుకోవడం బాహ్య ప్రపంచానికి కష్టంగా మారింది.
సుమారు 12 గ్రామాలు ధ్వంసమయ్యాయని, వందలాది మంది పౌరులు శిథిలాల కింద కూరుకుపోయారని, తక్షణ సహాయం అందిస్తున్నామని ఆ దేశ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రాయన్ తెలిపారు.
హమాస్ దాడి వెనుక ఇరాన్ హస్తం ఉండి ఉంటుందని ఇజ్రాయిల్ ఇప్పటివరకు బలంగా నమ్ముతూ వస్తుండగా, దానిని నిజం చేస్తూ తాజాగా హమాస్ సంస్థ ప్రకటించింది.
భూకంప ప్రభావంతో హెరాత్ జిల్లాలోని నాలుగు గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
హమాస్ మిలిటెంట్లను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్‌ను స్టార్ట్ చేసింది. గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి.
సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.
ఆగస్టులోనే అమెరికా నౌకాదళ నిపుణులు ఈ సబ్‌మెరైన్ ప్రమాదం గురించి చెప్పగా.. అప్పట్లో తైవాన్, చైనా రెండూ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చాయి. తాజాగా బ్రిటన్ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టుల ఆధారంగా ‘డైలీ మెయిల్’ ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
మెకార్థీపై వ్యతిరేకత మరింత పెరిగింది. పదవిని కాపాడుకునేందుకు ఆయన డెమోక్రాట్లతో చేతులు కలిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఆయనపై రిపబ్లికన్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో పర్యటించిన ఆయన ఈ రెండు పేలుళ్ల వెనుక భారత నిఘా విభాగమైన `రా` పాత్ర ఉందన్న కోణంలో తమ దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయన్నారు.
కెనడాలో భారత దౌత్య కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అక్కడ పని చేసే వారికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది సాధారణ స్థితిగా మేం పరిగణించాలా అని జైశంకర్ ప్రశ్నించారు.