International
ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షను బుధవారం సుప్రీం సమర్థించింది. అయితే, శిక్ష ఖరారు దశలో సుదీర్ఘ కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన ముషారఫ్ కోర్టు అనుమతితో చికిత్స కోసం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లి గతేడాది ఫిబ్రవరి 5న కన్నుమూశారు.
సాయుధులై ఛానల్‌లోకి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు.
బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు.
ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 292 మంది ప్రయాణికులు ఉన్నట్లు.. ఎక్కువ మంది భారతదేశం నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారని అధికారులు చెప్పారు.
చైనాలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని కై జువాంగ్‌కు చెప్పి, నువ్వే స్వయంగా కిడ్నాప్ గురైనట్లు దూర ప్రాంతానికి వెళ్లి అక్కడి నుండి ఫొటోలు పంపాలని సైబర్ కిడ్నాపర్లు అతనిని బెదిరించారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లోని అత్యంత శక్తివంతమైన ఖుద్స్ ఫోర్స్‌కు నేతృత్వం వహించిన ఖాసీం సులేమానీ.. 2020 జనవరి 3న అమెరికా డ్రోన్ దాడిలో మృతిచెందారు.
స్థానిక మీడియా ప్రసారం చేసిన వీడియాల్లో కూలిపోయిన భవనాలు, ఓడరేవు వద్ద మునిగిపోయిన పడవలు, లెక్కలేనన్ని కాలిపోయిన ఇళ్లు, ధ్వంసమైన సూపర్ మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు, రోడ్ల దృశ్యాలు కనిపించాయి.
ఇమ్రాన్‌తో పాటు విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్ ఖురేషీ, మరో మాజీ మంత్రి హమ్మద్ అజర్ నామినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి.
అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో మతపరమైన, జాతి పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారని వివేక్ స్పష్టం చేశారు.