International

ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

వరదల కారణంగా ఘోర్‌ ప్రావిన్స్‌లో పరిస్థితులు దారుణంగా మారాయని, 2500కు పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ ’ఎక్స్‌’ వేదికగా తెలిపింది.

తెలంగాణకు చెందిన రూపేష్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. అతడు అదృశ్యమైనట్లు తెలియగానే కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలకు HIV సోకినట్లు తేలింది. US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

చైనాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో గ్వాంగ్‌జౌ ఒకటి. 12 కోట్లకు పైగా జనం ఇక్కడ నివసిస్తుంటారు. చైనా ఎగుమతలకు సంబంధించిన ప్రధాన నగరం గ్వాంగ్‌జౌ.

స్థానికులు వెంటనే స్పందించి విట్టాల్‌ను, చికారాను విమానంలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికారా ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఇక తీవ్ర గాయాలకు గురైన విట్టాల్‌కు శస్త్ర చికిత్స జరిగింది.

ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఒక‌దాన్నొక‌టి ఢీకొట్టాయి.

ఇరాన్‌పై ప్రత్యక్ష దాడికి దిగేందుకు తాము వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడిని ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.