International

పోర్చుగల్, స్పెయిన్‌కు చెందిన పైలట్లతో కూడిన ‘యాక్‌ స్టార్స్‌’ అనే ఏరోబాటిక్‌ గ్రూప్‌ ఈ వైమానిక విన్యాసాలను ప్రదర్శిస్తోంది. వీటిలో పాల్గొన్న విమానాలన్నీ యాకోవ్లావ్‌ యాక్‌–52 రకానికి చెందినవి.

ముస్లిం మెజారిటీ దేశమైన పాకిస్థాన్‌లో ఓ క్రైస్తవ మైనారిటీ మహిళకు అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ తొలి మహిళా బ్రిగేడియర్‌గా డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్ నియ‌మితుల‌య్యారు.

ఈ కేసులో శిక్షకు సంబంధించి జులై 11న కీలక తీర్పు వెల్లడించనుంది న్యూయార్క్ కోర్టు. ఐతే ఈ తీర్పున‌కు కొన్ని రోజుల ముందే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది.

ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలనే ఉత్సాహం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు.

పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో, ఎన్గా ప్రావిన్స్‌లో ఈ ఘోర విపత్తు సంభవించింది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

కొంతమంది స్థానిక ఏజెంట్ల మాటలు వినడం వల్లే ఉద్యోగులు సమ్మెకు దిగారని చెబుతోంది. ఉద్యోగులు సమ్మెకు దిగడం ద్వారా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమానయాన శాఖ డిప్యూటీ మంత్రి ప్యాట్రిస్‌ వెగ్రిట్‌ మీడియాకు తెలిపారు.

ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

ఈ హత్యలో హనీ ట్రాప్ ఒక కీలక అంశంగా పరిగణిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆధారాలను బట్టి ఎంపీని గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఉంటారని భావిస్తున్నామన్నారు.

భారతీయ సంతతి అమెరికా పౌరురాలైన జయ బాడిగ.. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోర్నియా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటార్నీగా పనిచేశారు.

ఇరాన్ రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లింది. నిన్నటి నుంచి రైసీ కోసం దట్టమైన అటవీప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టింది. దాదాపు 15 గంటలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.