International

ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు. ఈ మరణాలకు ప్రధాని షేక్ హసీనానే కారణమని, ఆమె వెంటనే తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

యునిడోస్‌ ప్రచారంలో ప్రసంగించాల్సి ఉన్న బైడెన్‌ కోవిడ్‌ పాజిటివ్‌ అని తెలియగానే.. అర్ధంతరంగా ఆ పర్యటనను నిలిపివేసి డెలావేర్‌కు బయలుదేరారు.

అమెరికా మాజీ అధ్య‌క్షుడికి పొంచి ఉన్న ముప్పునకు సంబంధించి తమకు నిరంతర సమాచారం అందుతోందని సీక్రెట్‌ సర్వీస్‌ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మి తెలిపారు.

భద్రతా సిబ్బంది వెంటనే ట్రంప్‌ చుట్టూ రక్షణగా చేరారు. ఆయన్ని వేదికపై నుంచి దించి ఆస్పత్రికి తరలించారు. ట్రంప్‌ ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు భద్రతా అధికారులు తెలిపారు.

ప్రయాణికులు సహా నదిలో పడిపోయిన బస్సులు గణపతి డీలక్స్, ఏంజెల్‌గా అధికారులు గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్‌ కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో మార్క్‌ రుట్టే కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగించి తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అయితే, అందరు నేతల్లా బందోబస్తు నడుమ కారులో కాకుండా సింపుల్‌గా సైకిల్‌పై తన సొంతింటికి వెళ్లిపోయారు.

గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్‌ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

బెయిలవుట్‌ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్తాన్‌ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.