అత్యాచారం కేసులో ఆస్ట్రేలియాలో అరెస్టైన 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి' వ్యవస్థాపక అధ్యక్షుడు
2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా సందర్శించినప్పుడు సిడ్నీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినవారిలో బాలేష్ ధంకర్ ప్రముఖుడు. అతను ప్రధానమంత్రిని కలవడం గురించి గొప్పలు చెప్తూ, పీఎం మోడీతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్రముఖ బిజెపి కార్యకర్త, ఆస్ట్రేలియాలోని హిందూ కౌన్సిల్ మాజీ అసోసియేట్, ఆస్ట్రేలియాలోని 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి' వ్యవస్థాపక అధ్యక్షుడు బాలేష్ ధంకర్ ను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. 13 లైంగిక వేధింపులు, సమ్మతి లేకుండా వీడియో రికార్డింగ్‌లు, మత్తు పదార్ధాలను ఉపయోగించడం, అసభ్యకరమైన చర్యలతో కూడిన దాడి తదితర ఆరోపణలతో ఆయన మీద కేసు నమోదు చేశారు.
2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా సందర్శించినప్పుడు సిడ్నీలో రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినవారిలో బాలేష్ ధంకర్ ప్రముఖుడు. అతను ప్రధానమంత్రిని కలవడం గురించి గొప్పలు చెప్తూ, పీఎం మోడీతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చాయి.
హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా తరపున, అతను 2015లో హెచ్‌సిఎ నిర్వహించిన సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ క్లైమ్లో, సిడ్నీ విశ్వవిద్యాలయంలో సర్వమత సెమినార్‌లతో సహా అనేక కార్యక్రమాలలో ప్రసంగించాడు. ఆస్ట్రేలియాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపిలో నాయకత్వ బాధ్యతల్లో అతను ఉన్నాడు.
హిల్టన్ హోటల్‌కు నకిలీ ఉద్యోగ ఇంటర్వ్యూలకు రప్పించి ఐదుగురు కొరియన్ మహిళలపై ధంకర్ అత్యాచారం చేసి కెమెరాతో చిత్రీకరించాడని పోలీసులు ఆరోపించారు.
నవంబర్ 2014లో సిడ్నీలో భారత ప్రధాని కోసం కమ్యూనిటీ ర్యాలీని నిర్వహించడంలో ధంకర్ ప్రముఖ పాత్ర పోషించాడని ఆస్ట్రేలియాలోని భారత డాక్టర్ యాదు సింగ్ పేర్కొన్నట్లు ఒక వార్తాపత్రిక నివేదిక పేర్కొంది.
"సిడ్నీలోని ఒక కమ్యూనిటీ వార్తాపత్రిక అతని గురించి, అతని కార్యకలాపాల గురించి కొన్ని సంవత్సరాల క్రితమే అనేక వార్తలను ప్రచురించింది. కానీ బాధితులు ముందుకు రాలేదు. అతని కమ్యూనిటీ వ్యక్తులు ఆ ఆరోపణలను సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడొచ్చిన ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఆస్ట్రేలియన్ న్యాయ వ్యవస్థ వాటిని సరైన పద్దతిలో పరిష్కరిస్తుంది. ”అని సింగ్, బాలేష్ ధంఖర్ రేప్ ఆరోపణల గురించి అన్నారు.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ప్రకారం...మంగళవారం నాడు విచారణ ప్రారంభ సమయంలో ప్రాసిక్యూటర్ జ్యూరీకి, కొరియన్ యువతుల పట్ల ధన్‌ఖర్‌కు ప్రత్యేకమైన ఆసక్తి ఉందని చెప్పినట్లు నివేదించింది. అతను కొరియన్-ఇంగ్లీష్ మాట్లాడేవారికి అనువాద పని కోసం ఇంటర్వ్యూలకు పిలిచాడు. తన సిడ్నీ అపార్ట్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న హిల్టన్ హోటల్ బార్‌లో వారితో సమావేశమయ్యాడు.
ధంఖర్ ఒక ఇంటర్వ్యూయర్‌గా నటిస్తూ , వారికి అబద్ధం చెప్పడం ద్వారా "తన లైంగిక కోరికలను తీర్చుకున్నాడు. ఆ మహిళలకు ఆ సమయంలో మత్తు పదార్థాలు ఇచ్చి ఉండవచ్చు. ఆ వ్యవహారాన్ని దన్ ఖర్ వీడియో రికార్డు చేశాడు "అని ప్రాసిక్యూటర్ వాదించినట్టు నివేదిక పేర్కొంది.
అపస్మారక స్థితిలో ఉన్న ఆసియా, కొరియన్ మహిళల చిత్రాలు, వీడియోలను ధంఖర్ రికార్డ్ చేశారని జ్యూరీకి ప్రాసిక్యూటర్ చెప్పాడు.
ఆసక్తికరంగా, ధంఖర్ న్యాయవాది రెబెక్కా మిచెల్, ఆయనపై వచ్చిన ఆరోపణలపై స్పంధిస్తూ, ధన్‌ఖర్‌కు మహిళలపై లైంగిక ఆసక్తి ఉందని, వారిని కలవడానికి నకిలీ ప్రకటనను ఉపయోగించాడని, అతని వ్యాపారం తప్పు అని, మోసపూరితం అని అంగీకరించారు. ధంఖర్ కూడా మహిళలతో లైంగిక సంబంధం గురించి వివాదమేమీ చేయడం లేదని ఆమె తెలిపారు.
" ఫిర్యాదుదారుల్లో ప్రతి ఒక్కరూ దంకర్ తో లైంగిక చర్యలకు అంగీకరించారు." అని మిచెల్ జ్యూరీకి తెలిపారు.
మహిళలకు మత్తుమందు ఇచ్చాడన్న విషయాన్ని రెబెక్కా మిచెల్ ఖండించారు.
ధన్‌ఖర్ దగ్గర అతను మహిళలతో లైంగికంగా సన్నిహితంగా ఉన్న 47 వీడియోలతో కూడిన హార్డ్‌డ్రైవ్ దొరికిందని కేసు ఇన్‌ఛార్జ్ అధికారి సార్జెంట్ కత్రినా గైడ్ కోర్టుకు తెలిపారు.
Balesh Dhankar was one of the organizers of PM Modi's community rally in Sydney and subsequently visited India to meet the PM. He also hosted Subramanian Swamy and Sambit Patra. pic.twitter.com/WGtqooqJo4
— Sanjay Malhotra (@SanjayM91431026) March 15, 2023