Telugu Global
International

హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి..

ఎండ వేడి కి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందార‌ని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు స్వయంగా ప్రకటించారు.

హజ్ యాత్రలో 550 మందికి పైగా మృతి..
X

సౌదీలో హజ్‌ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. అయితే ఈ సారి అక్కడ ఎండ తన ప్రతాపం చూపించింది. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ వేడి కి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా మృతిచెందార‌ని మంగళవారం అరబ్ దౌత్యవేత్తలు స్వయంగా ప్రకటించారు. తెలిపారు. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. కానీ ఈజిప్టు దేశానికి చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. అలాగే మరణించినవారిలో జోర్డాన్‌ దేశస్తులు కూడా ఉన్నారు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 577 కాగా వారిలో సుమారు 323 మంది ఈజిప్టియన్లు 60 మంది జోర్డానియన్లు ఉన్నారు.

మరణించినవారంతా అధిక వేడి సంబంధిత స‌మ‌స్య‌ల‌తోనే మ‌ర‌ణించిన‌ట్లు వెల్ల‌డించారు. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు ఎంతగా జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఇక మక్కా సమీపంలో ఉన్న అల్-ముయిసెమ్ ఆసుప‌త్రి మార్చురీలో మొత్తం 550 మృత‌దేహాలు ఉన్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. వేడి సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందించిన‌ట్లు సౌదీ అధికారులు తెలిపారు.

ప్ర‌స్తుతం మ‌క్కాలో అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్నాయి. మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద సోమవారం 51.8 డిగ్రీల సెల్సియస్ (125 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్‌ నిర్వహకులకు చెబుతుండటంతో వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్టు సమాచారం. గత సంవత్సరం వివిధ దేశాలు కనీసం 240 మంది యాత్రికులు మరణించారు, అయితే అప్పుడు ఎక్కువ మంది ఇండోనేషియన్లు. ఈసారి ఇప్పటివరకు 136 మంది ఇండోనేషియా హజ్ యాత్రికులు మరణించారు..ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్‌ నిర్వాహకులు వెల్లడించారు.

First Published:  19 Jun 2024 4:45 AM GMT
Next Story