ఫెడరల్ ఉద్యోగులకు ఓపీఎం రెండోసారి మెయిల్
వారం రోజుల్లో చేసిన పనులను వివరించాలని స్పష్టీకరణ

అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మరోసారి యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ (ఓపీఎం) మెయిల్స్ పంపించింది. వారం రోజులుగా చేసిన ఐదు పనులను తెలుపాలని స్పష్టం చేసింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం సూచనల మేరకు గత వారం కూడా ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. ప్రతిస్పందించకుండా ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని అప్పుడు మస్క్, ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే. అయినప్పటికీ అమెరికా న్యాయశాఖ ఎఫ్‌బీఐ, ఇంటెలీజెన్స్ విభాగం వంటి ఫెడరల్ ఏజెన్సీలు మెయిల్స్‌కు స్పందించవద్దని ఉద్యోగులకు తెలిపాయి. డిస్ట్రిక్ట్ కోర్టు కూడా యూఎస్‌ఓపీఎంకు ఫెడరల్ ఉద్యోగులను తొలిగించే అధికారం లేదని స్పష్టం చేసింది. ఫలితంగా ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ క్రమంలో మళ్లీ అన్ని విభాగాల ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్ ఓపీవో మెయిల్ పంపింది. ఈసారి ఉద్యోగాలు తొలిగిస్తామనడం, లేదా ప్రతిస్పందనపై గడువు పెట్టడం వంటివి చేయలేదు. అయితే మస్క్ మాత్రం రెండో మెయిల్‌కు కార్యనిర్వహణ శాఖలకు సూచించారు. ఎవరైనా రహస్య సమాచారంపై పనిచేస్తే చేసిన పని గురించి కాకుండా క్లాసిఫైడ్ పైనా రిప్లై ఇవ్వాలని స్పందించాలని స్పష్టం చేశారు.