జపాన్‌పై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి దాడి చేసింది. దాంతో జపాన్ అధికారులు ఈశాన్య ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పారు .
కొరియా మంగళవారం జపాన్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాల్సిందిగా జపాన్ నోటీసులు జారీ చేసింది. అలాగే పలు రైళ్లను నిలిపివేసింది. ఉత్తరకొరియా ఐదేళ్లలో ఇలా చేయడం ఇదే తొలిసారి.
ఉత్తర కొరియా పూర్తి స్థాయి అణు ఆయుధాగారాన్నిఏర్పాటు చేసుకునే క్రమంలో క్షిపణి పరీక్షలను వేగవంతం చేసింది. దీని ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలను హెచ్చరించడానికి, తమ దేశం అణు దేశంగా గుర్తింపు పొంందాలనే ఆలోచనతోనే ఉత్తర కొరియా ఈ ప్రయోగాలు చేస్తోంది.
జపాన్‌పై సుదూర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించాలన్న ఉత్తర కొరియా ప్రమాదకరమైన, నిర్లక్ష్య నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇలా చేయడం అస్థిరతను కలిగిస్తోంది. అంతేగాక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలు, అంతర్జాతీయ భద్రతా నిబంధనలను ఉత్తర కొరియా విస్మరించిందనడాదనికి ఇది నిదర్శనమని అమెరికా పేర్కొంది.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంతో జపాన్ అధికారులు ఈశాన్య ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పారు . 2017 లో ఉత్తర కొరియా ఆయుధ పరీక్షల సమయంలో కొన్నివారాల వ్యవధిలోనే జపాన్‌పై రెండు సార్లు మధ్యంతర క్షిపణులను ప్రయోగించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు క్షిపణి ప్రయోగం జరిపింది.
జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా విలేకరులతో మాట్లాడుతూ.. తాజా క్షిపణి ప్రయోగం "నిర్లక్ష్యపూరిత చర్య. నేను దానిని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
ఉత్తర కొరియాలోని లోతట్టు ఉత్తర ప్రాంతం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. తరచూ ఇలా జరిగే క్షిపణి ప్రయోగాలు అంతర్జాతీయంగా దాని ఒంటరితనాన్ని రుజువు చేయడమేగాక ప్రపంచానికి ఆ దేశానికి మధ్య దూరాన్ని పెంచుతుందని అన్నారు.
ఈ క్షిపణి ప్రయోగంపై చర్చించేందుకు దక్షిణ కొరియా, జపాన్ రెండూ అత్యవసర జాతీయ భద్రతా మండలి సమావేశాలను ఏర్పాటు చేశాయి. తాజా పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు అభిప్రాయాలను పంచుకున్నారు.