Telugu Global
International

జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ వేటు

అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్య

జన్మతః పౌరసత్వంపై ట్రంప్‌ వేటు
X

వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేశారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుంది. తాజాగా దీనిపై ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. 'అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించదు' అని ట్రంప్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన ప్రభుత్వం వలస విధానంపై తీసుకునే చర్యలకు ఇది చిహ్నమని నిపుణులు చెబుతున్నారు.

ఈ సందర్భంగా అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం అందిస్తున్నదని ట్రంప్‌ తప్పుగా వ్యాఖ్యానింఆచరు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి. అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నది. ఈ విధానం దాదాపు శతాబ్దకాలంగా అమల్లో ఉన్నది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకూ, టూరిస్టు లేదా స్టూడెంట్‌ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకూ ఈ నియమం వర్తిస్తుంది. కాగా, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉన్నది.

First Published:  21 Jan 2025 9:39 AM IST
Next Story